Us asked by iraq to air strike on isis militants group

US asked by Iraq to air strike on ISIS militants group, US F-18 on surveillance over Iraq, Obama says no need Congressional leaders permission to save Iraq, Air strikes by US request from Iraq

US asked by Iraq to air strike on ISIS militants group

వాయుమార్గంలో కాపాడండి- ఒబామాను కోరిన ఇరాక్ ప్రధాని

Posted: 06/19/2014 03:28 PM IST
Us asked by iraq to air strike on isis militants group

ఇరాక్ సిరియా దేశాల ఎల్లలను లెక్కచెయ్యకుండా ఆ రెండు దేశాలను కలిపి తనదైన ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించుకునే యత్నంలో ఉన్న ఐఎస్ఐఎస్ ని తరిమికొట్టటానికి, అమెరికాని వైమానిక దళం ద్వారా దాడి చెయ్యమని ఇరాక్ ప్రభుత్వం కోరింది.  సున్ని ముస్లింలైన ఐఎస్ఐఎస్ సేనకి ఉగ్రవాద అల్ ఖ్వేదా మద్దతుంది.  ఇరాక్ నుంచి ఉత్తర సిరియా వరకు ఐఎస్ఐఎస్ తన రాజ్యాన్ని స్థాపించుకునే దిశగా ఆ దేశాల్లో దాడులు చేసి కొన్ని స్థావరాలను కైవసం చేసుకుంది.  ఇంతవరకు 1700 మంది షియాలను అంతమొందించామని ఐఎస్ఐఎస్ ప్రకటించుకుంది.  ఇరాక్ లో ప్రాణ భయంతో సామాన్య ప్రజానీకమే కాకుండా సెక్యూరిటీకి చెందిన సీనియర్ అధికారులు కూడా పారిపోయారు.  

iraq-attacked

ఇరాక్ ప్రధానమంత్రి నౌరి అల్ మలికి అమెరికా అధ్యక్షుడు ఒబామాని ఇరాక్ లో సంక్షోభం సృష్టిస్తున్న అల్ ఖ్వేదా ప్రోత్సాహంతో దాడులు చేస్తున్న ఐఎస్ఐఎస్ సైన్యాలను అదుపు చెయ్యటానికి వాళ్ళ మీద వైమానిక దాడి చెయ్యవలసిందిగా కోరారు.  బుధవారం మధ్యాహ్నం ఎఫ్-18 ఫైటర్ జెట్ లు ఇరాక్ లో పరిస్థితిని గమనించటానికి వెళ్ళాయి.  పైలట్లు ఉన్నవి కానీ లేక మానవ రహిత విమానాలను ఇరాక్ మీద పరిశీలనకు వెళ్ళటానికి అమెరికా ప్రభుత్వం అనుమతించింది.  అయితే ఎఫ్-18 లు యుద్ధ విమానాలే కానీ నిఘా పరిశీలనలకు ఉపయోగించేవి కావు.      

f-18ఇరాక్ లో ఉన్న పరిస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకోవటానికి, ఒబామా తనకి కాంగ్రెషనల్ నాయకుల అనుమతి తీసుకునే అవసరం లేదని అన్నారు.  అయితే ఒబామా నేల మీద కాకుండా విమానాల ద్వారా పైనుంచి ఐఎస్ఐఎస్ మీద దాడి చెయ్యటమే జరుగుతుందని అన్నారు.  

obama

దానికి ప్రతిగా సర్క్యులేషన్ లో ఉన్న ఒక వీడియా ద్వారా, అమెరికాకు చెందిన ప్రపంచంలోని అన్ని ఎంబసీల మీదా దాడి చెయ్యమని మొరాకోకి చెందిన సున్ని మతాధికారి షేక్ మొహమద్ అలి అల్గజౌలీ ఆన్ లైన్ లో పిలుపునిచ్చారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles