Telangana cm kcr responds over power issue

CM KCR Responds over Power Issue, KCR Responds over Power Issue, Telangana CM KCR Responds over Power Issue,

Telangana CM KCR Responds over Power Issue

నేను చంద్రబాబు లాంటివాడిని కాదు: కేసిఆర్

Posted: 06/19/2014 03:07 PM IST
Telangana cm kcr responds over power issue

తెలుగు రాష్ట్రాల మద్య కరెంట్ యుద్దం నడుస్తుంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు .. ఈరోజు తెరపైకి వచ్చారు. గత రెండు రోజుల నుండి విద్యుత్ వార్ నడుస్తుంది. అయిన నేను పెద్దగా పట్టించుకోలేదని కేసిఆర్ అన్నారు. ‘‘నేనేం చంద్రబాబు లాంటి వాడిని కాదు.. అవకాశం ఉన్నా ప్రతీకారం తీర్చుకొనే మనస్తత్వం నాకు లేదు’’. అని అంటూనే.. తన బలం గురించి సీఎం కేసిఆర్ చెప్పటం మొదలు పెట్టారు. కరెంట్ కొనుగొళుకు సంబంధించిన ఒప్పందాలను రద్దు చేసుకొని తెలంగాణను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుచేస్తున్నాడని మా ప్రభుత్వ అధికారులు మా దృష్టికి తీసుకొచ్చారు. కానీ కొంచెం సమయం వేచి ఉండాలని వారిని కోరటం జరిగిందని సీఎం కేసిఆర్ చెప్పటం జరిగింది.

అయినా సీమాంద్రలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు కావాల్సిన సరుకు మా తెలంగాణ నుండి వస్తున్న విషయం చంద్రబాబు ఎలా మరిచిపోయాడని కేసిఆర్ ప్రశ్నించారు. ఆ వనరులు ఆపే శక్తి మాకు ఉంది. కానీ మేము అలాంటి పనులకు మేము పూనుకోలేదని సీఎం అన్నారు. సీమాంద్రలోని కడప, విజయవాడలోని ఉన్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాకు తెలంగాణ సింగరేణి బొగ్గే ఆధారం అని తెలంగాణ సీఎం కేసిఆర్ గుర్తుచేయటం జరిగింది. ఆంద్రప్రదేశ్ వెళ్లే ఆ బొగ్గు సరఫరాను అడ్డుకోవాలని తెలంగాణ అధికారులు ఆవేశంగా ఉన్నారు.

కానీ ఇలాంటి చిన్నపిల్ల చేష్టలకు మనం దూరం అని వారిని శాంతింప చేసినట్లు కేసిఆర్ చెబుతున్నారు. అయితే ఇక్కడ ఎవరు తప్పు చేశారు? ఎవరి మీద ఎవరు ప్రతీకారం తీర్చుకుంటున్నారో ఎవరికి అర్థం కావటంలేదు. రెండు రాష్ట్రాలనేతల రాజకీయలతో.. తెలుగు ప్రజలు నలిగిపోతున్నారనే విషయం ఇరుప్రాంతాల నేతలు తెలుసుకుంటే .. సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని .. రాజకీయ మేథావులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles