Dadi veerabhadra rao sensational attacking comments on jagan

Dadi Veerabhadra Rao attacking to jagan, YCP Leader Dadi Veerabhadra Rao, Dadi Veerabhadra Rao Sensational Comments, Dadi Sensational Comments On YS Jagan, YSRCP leader Dadi Veerabhadra Rao resigns, Dadi Veerabhadra Rao makes controversial comments on Jagan, raises sensational comments again Jagan.

Dadi Veerabhadra Rao Sensational Attacking Comments On Jagan, YSRCP leader Dadi Veerabhadra Rao resigns,

జగన్ నీ అహంకారం..మడిచి..? దాడి

Posted: 06/11/2014 06:41 PM IST
Dadi veerabhadra rao sensational attacking comments on jagan

తంతే.. బూరేల బుట్టలో పడేవారిని చూసి ఉంటాం. కానీ ఈయన మాత్రం దరిద్రపు కొంపలోపడ్డారు. ఈయనే ఎవరు కాదు గతంలో సైకిల్ పార్టీలో సీనియర్ నేత. ఈయన ‘దాడి ’చేస్తే.. ఎదుటివారు.. అన్నీ మూసుకోని ..సర్థుకోవాల్సింది. చంద్రబాబు లోఎలాంటి విభేదాలు లేకపోయినప్పటికి, జైల్లోఉన్న వైఎస్ జగన్ కోసం.. చంచల్ గూడ. జైలు.. తలుపులు తోసుకుంటూ.. వెళ్లి జగన్ దర్శనం చేసుకొని వచ్చి, ఇలాంటి నాయకుడు నేను ఎప్పుడు చూడలేదు. నేను విన్న జగన్ వేరు, ఇప్పుడు చూసిన జగన్ వేరు అని మీడియా ముందు పొగడ్తల గంప నెత్తిన పెట్టుకొని చెప్పిన దాడి వీరభాద్రరావు .. ఈరోజు జగన్ పై ఘోరంగా దాడి చేయటం జరిగింది.

జగన్ లో కావాల్సింనంత అహంకారం పుష్కలంగా ఉందని దాడి ఇన్ని రోజులకు గుర్తించారు. అసలు ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిపోవటానికి కారణం ఒక్కటేనట.. ఆయన జైలు నుండి బయటకు రావటమే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని అంటున్నారు. జగన్ జైల్లో ఉంటే.. వైకాపా భారీ మెజార్టీతో గెలిసేదని ..విశాఖపట్నంలో మీడియాతో చెప్పటం జరిగింది. అసలు జగన్ లో ఉన్న ప్రవృత్తులు బయటకు వచ్చాయని ఆయన అన్నారు.

dadi-vs-ys-jagan

జగన్ సొంత చెల్లి షర్మిలకు రాజకీయంగా తొక్కేసాడని దాడి అన్నారు. జగన్ తల్లి విజయమ్మ ను కావాలనే ఎన్నికల్లో జగనే ఓడిపోయే విదంగా చేశాడని దాడి చెప్పటం జరిగింది. తల్లిని ఊరు కాని ఊరులో పోటీకి నిలిపిన జగన్ సరిగా ప్రచారం ఎందుకు చేయలేదని దాడి ప్రశ్నించారు. మొత్తం నీలో ఉన్న అహంకారాన్ని మడిచి.. ?

జగన్ డాన్ మాదిరిగా ఎవరితో సంప్రదింపులు జరగకుండా నిర్ణయాలు తీసుకోవటం వల్లనే పార్టీ ఓటమి పాలైందని ఆయన అన్నారు. ఇప్పటికైనా జగన్ కళ్లు తెరిచి వాస్తవాలు గమనిస్తే మంచిదని ఆయన హితవు పలికారు. వైఎస్సార్సీపీలో చేరడమే తాను చేసిన తప్పు అని ఆయన అన్నారు. తాను పార్టీకి గుడ్ బై చెబుతున్నానని దాడి వీరభద్రరావు ప్రకటించారు.వైకాపా కాలగర్భంలో కలసి పోవడం ఖాయమని దాడి వీరభాద్రరావు ఆవేశంగా చెప్పి, వెళ్లిపోవటం జరిగింది.

‘‘అంతే..ఉన్నది పోయింది.. ఉంచుకున్నది పోయింది’’అనే సామెత దాడికి భాగా సరిపోతుంది. అదే టిడిపిలో ఉంటే.. ఈరోజు మంత్రిగా .. సీమాంద్ర ప్రజలకు సేవలు చేసే భాగ్యం కలిగేది. దరిద్రం దేవత.. రా రమ్మని రారా.. రమ్మని దాడిని పిలుస్తుంటే.. ఎవరు మాత్రం తప్పించుకుంటారు చెప్పండని అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles