Trs mp kavitha for change in polavaram design

mp Kavitha for change in Polavaram design, trs mp Kavitha, TRS MP Kavitha first speech, TRS MP Kavitha first speech in Lok Sabham, Nizamabad MP Kavitha, టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత, పోలవరం ప్రాజెక్టు.

trs mp Kavitha for change in Polavaram design, TRS MP Kavitha first speech in Lok Sabha

అరవై ఏళ్ల సమస్యను ఇలా పరిష్కరిస్తారా? కవిత

Posted: 06/11/2014 08:12 AM IST
Trs mp kavitha for change in polavaram design

అరవై ఏళ్ల సమస్యను ఇలా పరిష్కరిస్తారా? అని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. లోక్ సభలో ఆమె మాట్లాడుతూ.. పోలవరం సమస్య పై ఇలా నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆవేశంగా మాట్లాడటం జరిగింది. ఇది కేవలం తెలంగాణ, ఆంద్రప్రదేవ్ రాష్ట్రాల వివాదం కాదన్నారు. నాలుగు రాష్ట్రాలతో అనుసంధానమై ఉన్న సమస్య అని కవిత వ్యాఖ్యనించారు. ఇలాంటి సమస్యపై హడావుడిగా నిర్ణయం తీసుకోవటం సరికాదన్నారు.

తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు నిర్ణయించిన తర్వాత ఖమ్మం జిల్లా పరిధిలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయడం సరి కాదని కవిత వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్టీఏ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ ఆర్డినెన్స్ జారీ చేయడం దురదృష్టకరమని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీరు వెళ్లాల్సిందేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కేవలం డిజైన్ మాత్రమే మార్చాలని చెబుతున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యామ్నాయాలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కవిత చేసిన వ్యాఖ్యలపై.. సీమాంద్ర ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు మండిపడుతన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles