Padma devender reddy don t like to be deputy speaker post

trs mla, Padma Devender Reddy, deputy speaker post, Dy Speaker Poll Notification Today

Padma Devender Reddy don-t like to be deputy speaker post, Dy Speaker Poll Notification Today

నాకు ఈ స్పీకర్ పదవి ఇష్టంలేదు?

Posted: 06/11/2014 09:23 AM IST
Padma devender reddy don t like to be deputy speaker post

నాకు గీ స్పీకర్ పదవి ఇష్టం లేదని .. టీఆర్ఎస్ ఎం.పద్మా దేవేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవి చేపట్టలేనని ఎం. పద్మా దేవేందర్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్‌గా ఉంటే రాజకీయంగా నష్టపోతానని, దానికన్నా ఎమ్మెల్యేగా ఉంటేనే మంచిదని పేర్కొంటున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టాలంటూ ఆమెకు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు ద్వారా కేసీఆర్ ఆదేశాలిచ్చారు. ఇందుకు పద్మ అంగీకరించలేదు.

పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా పద్మను బుజ్జగించారు. ‘‘డిప్యూటీ స్పీకర్ హోదాలో మంత్రుల కార్యాలయాలకు వెళ్లలేం. నియోజకవర్గ అభివృద్ధి కోసం సచివాలయానికి, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుంటే పనులు కావు.

డిప్యూటీ స్పీకర్‌గా ఉండి కార్యాలయం, బుగ్గకారు, అటెండర్‌తో సంతోషపడటానికేనా ఎమ్మెల్యే అయింది? నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకుంటే ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ ప్రజలకు దూరమవుతా. డిప్యూటీ స్పీకర్ పదవి వల్ల రాజకీయంగా నష్టమే. దానికంటే ఎమ్మెల్యేగా ఉండటమే మంచిది’’ అని పద్మా దేవేందర్‌రెడ్డి తెగేసి చెప్పారు.

కేవలం సెంటిమెంట్ భయంతోనే.. ఎమ్మెల్యే ఎం. పద్మా దేవేందర్ రెడ్డి డిప్యూటి స్పీకర్ పదవి పై అయిష్టత చూపుతుందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles