Sp explains increase in rapes in up

SP explains increase in rapes in UP, UP CM Akhilesh Yadav comments on rapes in UP, Mulayam Singh Yadav takes rapes light, Mulayam Singh supports boys doing rapes

SP explains increase in rapes in UP

సమాజంలో రేప్ లకు సమాజ్ వాదీ సంజాయిషీ!

Posted: 06/05/2014 11:16 AM IST
Sp explains increase in rapes in up

యుఎన్ సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్

ఉత్తర ప్రదేశ్ లో రోజు రోజుకీ మహిళల మీద పెరిగిపోతున్న అత్యాచారాలకు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ రేపిస్ట్ లను వెనకేసుకొస్తోంది.  

ఉత్తర్ ప్రదేశ్ లోని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని ఈ విషయంలో అందరూ విమర్శిస్తుంటే సమాజ్ వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ ఇలా సమర్థించుకుంటూ వచ్చారు.

చాలా చోట్ల స్త్రీ పురుషుల మధ్య ఉన్న రహస్య సంబంధం బయటపడేటప్పటికి దాన్ని రేప్ అని పిలుస్తున్నారు.  కొన్ని చోట్ల ఆడ మగ పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యంతో దగ్గరవుతున్నారు.  దాన్ని అంగీకరించని పెద్దల వలన హత్యలు జరుగుతున్నాయి.  ఇలాంటి సంఘటనలు ఆగటం లేదు, తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.  అయితే ఇలాంటివి అన్ని చోట్లా జరుగుతున్నాయి కానీ అక్కడ అవి వెలుగులోకి రావటం లేదు.

రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలో కూడా జరుగుతున్నాయి కానీ ఉత్తర్ ప్రదేశ్ లోని అత్యాచారాలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయన్నారు రామ్ గోపాల్ యాదవ్.  

అత్యాచారాల ఘటనలమీద స్పందించిన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మీడియా ప్రతినిధులతో, మేమేమీ స్పందన లేనివాళ్ళం కాదు.  మాకూ ఈ ఘటనలు బాధ కలిగిస్తున్నాయి.  నేరస్తులను కఠినంగా శిక్షిస్తున్నాం కూడా.  మీరు మీ పని చెయ్యండి, మమ్మల్ని మా పని చెయ్యనివ్వండి అన్నారు.

పోయిన నెలలో అత్యాచారాల మీద సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయమ్ సింగ్ యాదవ్ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలకు గురయ్యాయి.  రేప్ చేసిన వారిని ఉద్దేశించి ఆయన, పిల్లలు, మరి పిల్లలు తప్పు చేస్తారు.  అంత మాత్రం చేత పిల్లలను ఉరితీస్తామా ఏమిటి అన్నారు.  సమాజంలో మార్పు వస్తే తప్ప ఎవరూ ఏమీ చెయ్యలేరు.  మరి తండ్రులే కూతుళ్ళ మీద అత్యాచారం చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి.  దీన్ని పూర్తిగా ఆపటం ఎవరి తరమూ కాదు అన్నారాయన.  

akhilesh-mulayam

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్,

ఆయన తండ్రి సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయమ్ సింగ్ యాదవ్

అత్యాచారాలు ఎన్నో చోట్ల జరుగుతున్నాయి కానీ ఏ నాయకుడూ అక్కడికి పోయి పరామర్శించడు.  కానీ బదావ్ లో అత్యాచారానికి గురైన ఇద్దరు అమ్మాయిలు దళితులని మీడియా రాసింది, ఇక అంతే ప్రతి ఒక్కరూ అక్కడికి పోయేవారే, ఎస్ సి ఎస్ టి చట్టం కింద కేసు నమోదు చెయ్యమని డిమాండ్ చేసేవారే అన్నారు రామ్ గోపాల్ యాదవ్.  

ఉత్తర్ ప్రదేశ్ లోని అత్యాచారాలు, వాటి మీద నాయకులు చేసిన వ్యాఖ్యానాలను యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ నేషన్స్ కూడా ఘాటుగా విమర్శించాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని బదావ్  జిల్లాలో ఇద్దరు యువతుల మీద అత్యాచారం చేసి వారిని ఉరితీసిన ఉదంతాన్ని అత్యంత ఘాతుకంగా యుఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ అభివర్ణించింది.  యుఎన్ సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్, ములాయమ్ సింగ్ యాదవ్ అన్న అబ్బాయిలంతే అన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు.  అమానుషంగా రేప్ చేసి అమాయకులైన టీనేజ్ అమ్మాయిలను హత్యగావించటాన్ని అత్యంత తీవ్రమైన పదజాలంతో వ్యతిరేకించారాయన.  

అయితే, ఏమైనా అంటే మనం మనం అనుకోవాలి కాని ఇతర దేశస్తులు అంటే ఊరుకుంటామా.  ఈ వ్యాఖ్యల మీద వెంటనే ఎక్స్ టర్నల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ వాళ్ళతో ఏమీ అనలేదు కానీ, మీడియా తో మాత్రం, మనకీ ఒక వ్యవస్థ ఇక్కడ నడుస్తోంది.  న్యాయ పరిధిలో చెయ్యాల్సింది చేస్తున్నాం.  చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని అన్నారు.

కానీ ఆ వ్యవస్థనే దుయ్యబట్టారు యుఎన్ యుఎస్ అధికారులు.  భారత దేశంలో 2012 లో జరిగిన సామూహిక అత్యాచారం, యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కి నివేదికనిస్తూ భారత దేశంలోని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles