Minister venkaiah naidu press meet to modi 3d secrets

modi 3D secrets, Venkaiah Naidu press meet, Prime Minister Narendra Modi, Venkaiah Naidu.

minister Venkaiah Naidu press meet to modi 3D secrets

మోడీ ‘త్రీడీ ’ పై.. నాయుడు మాట!

Posted: 05/31/2014 01:07 PM IST
Minister venkaiah naidu press meet to modi 3d secrets

కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు తొలిసారి హైదరాబాదుకు వచ్చారు. ఎయిర్ పోర్టులో ఆయనకు రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అయితే ఇక్కడే కొద్ది సేపు మీడియాతో మాట్లాడారు.

ప్రతి భారతీయుడు తలెత్తుకునేలా దేశాన్ని పరిపాలిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మోడీ అంటే త్రీడీ (డెవలెప్ మెంట్, డైనమిక్, డెసిషన్ ) అని నిరూపించారని అన్నారు. మోడీ మేలు చేస్తాడని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని, అలాంటి ప్రజలకు మంచి చేయాలంటే బీజేపీ కార్యకర్త దగ్గర నుంచి నేత వరకు అందరూ ఆదర్శంగా నిలవాలని అన్నారు.

ఈ సారి దక్షిణాదిన 39 స్థానాలు గెలిచి బీజేపీ సత్తా చాటిందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ ఉందని చాటి చెప్పిన, అందుకు కారణమైన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు అని తెలిపారు. దేశం నిండా సవాళ్లు ఉన్నాయని అన్నారు. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

ఎన్నికలు అయిపోయాయి... ఇంకా విద్వేషాలు రేకెత్తించాల్సిన అవసరం లేదని అన్నారు. తాను మొదట భారతీయుడిని, ఆ తరువాత తెలుగు వాడినని... భాష వేరైనా, యాస వేరైనా మనం అన్నదమ్ములమని ఆయన గుర్తు చేశారు. మనలో మనం కొట్టుకోవడం కంటే సిగ్గుచేటైన విషయం మరొకటి లేదని ఆయన అన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles