నరేంద్ర మోడీ మంత్రివర్గంలో తొలిసారిగా తెలంగాణకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. యుపిఏ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి డజను మంది మంత్రులున్న పరిస్థితిని చూసిన వారికి ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఒక్కరికి మాత్రమే ప్రాతినిధ్యం లభించడం నిరాశ కలిగించింది.
తెలంగాణ ఏర్పడిన తరువాత అటు సీమాంధ్ర నుంచి, ఇటు తెలంగాణ నుంచి మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం లభిస్తుందని రాజకీయ పక్షాలు భావించాయి. అయితే ఏ కారణం వల్లనో కానీ ఆంధ్ర నుంచి ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పించిన మోదీ తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేదు.
తెలంగాణలో 17 పార్లమెంటు నియోజక వర్గాలు ఉండగా, సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి బండారు దత్తాత్రేయ ఒక్కరే గెలిచారు. గెలిచింది ఒక్కరు అయినా మంత్రివర్గంలో ఆయనకు చోటు ఖాయం అని భావించారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల తెలంగాణకు ఇబ్బందికరమైన పరిస్థితే అని టిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.
తెలంగాణకు ఎన్డిఏ ప్రభుత్వంలో అన్యాయం జరిగితే పార్లమెంటులో నిలదీస్తామని టిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. మేం 11 మంది ఎంపిలమున్నాం, పార్లమెంటులో మా వాణి వినిపిస్తాం అని టిఆర్ఎస్ ఎంపి ఒకరు తెలిపారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more