Tdp mahanadu two days program

TDP Mahanadu 2014, TDP Mahanadu two days program, Mahanadu Gandipeta Hyderabad, TDP Mahanadu to start with Chandrababu, TDP flag hoisting to start Mahanadu

TDP Mahanadu two days program at Telugu Vijayam, Gandipeta, Hyderabad

తెలుగు విజయంలో తెదేపా మహానాడు

Posted: 05/27/2014 09:27 AM IST
Tdp mahanadu two days program

అధికార, ప్రతిపక్ష బాధ్యతల్లో తెదేపా

నవ్యాంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేపట్టి, విడిపోయిన తెలంగాణా రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాను చేపట్టి తను ఆశించినట్లుగానే ఇరు ప్రాంతాలు ఇరు నేత్రాలుగా ప్రకటిస్తూ వస్తున్న తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం పార్టీ పండుగైన మహానాడును గండిపేటలోని తెలుగు విజయంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించనున్నారు.  

జాతీయ హోదా

విడిపోయిన ఈ రెండు రాష్ట్రాలే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తెలుగు దేశం ప్రముఖ పాత్రను వహించనుంది.  ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎంపీలు కేంద్రంలో మంత్రివర్గంలో సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేసారు.  ఈ సారి మహానాడులో పార్టీ జాదీయ హోదాను గురించి కూడా చంద్రబాబు ప్రకటించనున్నారు.

మహానాడు కార్యక్రమాలు

మహానాడు కార్యక్రమాలు మంగళ బుధవారాలు రెండు రోజులు జరుగనున్నాయి.  మోదీ ప్రమాణస్వీకారం తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా మహానాడుకి చేరుకుంటున్న చంద్రబాబు పార్టీ జెండా ఆవిష్కరణ తర్వాత ముందుగా ప్రధాన కార్యదర్శి పార్టీ వ్యవహారాల గురించి నివేదికను సమర్పిస్తారు.  పోయిన సంవత్సరం కన్నుమూసిన నాయకులకు సంతాపం, అమరవీరులకు నివాళి అయిన తర్వాత, పోయిన సంవత్సరం పార్టీ జమా ఖర్చుల నివేదిక ఉంటుంది.  ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రారంభోపన్యాసం ఉంటుంది.  దానితో ప్రారంభమయ్యే మహానాడు కార్యక్రమాలు రెండవ రోజు ఎన్టీఆర్ జయంతి రోజు బుధవారం సాయంత్రం తిరిగి చంద్రబాబు ముగింపు ఉపన్యాసంతో ముగుస్తుంది.  ఈ మధ్యలో పలు నాయకుల ఉపన్యాసాలుంటాయి.  రెండవరోజు ఉదయం ఎన్టీఆర్ కి నివాళులర్పించటం ఉంటుంది. 

మహానాడు సభలో ఎన్నికల సమయంలో చేసిన హామీలన్నిటినీ మరోసారి గుర్తుచేసుకుంటూ వాటిని నెరవేరుస్తామన్న వాగ్దానం చెయ్యనున్నారు.  అందులో, రైతుల ఋణ మాఫీ అన్నది ముందుగా చెయ్యవలసిన సంతకం.  

ఈసారి మహానాడు మిగతా సభలకంటే భిన్నమైనది. దశాబ్దకాలం తర్వాత తెదేపాకు పట్టం కట్టినందుకు కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలకు ఆ పార్టీ కృతజ్ఞతలు తెలుపనుంది.  

30 వేల మంది అతిథులకోసం సభాప్రాంగణం సిద్ధమైంది.  వేదిక మీద 300 మంది నాయకులు కూర్చోవటానికి ఏర్పాట్లు జరిగాయి.  వేదిక మీద వెనక భాగంలో ఎన్టీఆర్ చంద్రబాబుల పెద్ద పెద్ద ఫొటోలు ఏర్పాటు చేసారు.  

పార్టీ ప్రతినిధులు, అతిథులు, వాలంటీర్లు, పోలీసులు, మీడియా ప్రతినిధులకు రెండు రోజుల పాటు భోజన వసతి ఏర్పాట్లు కల్పించిన మహానాడు నిర్వాహకులు తెలంగాణా, రాయలసీమ ఆంధ్రా రుచుల వంటకాలను వారి కోసం ప్రత్యేకంగా తయారుచేయిస్తున్నారు.

తెదేపా విజయాన్ని తెలుగు ప్రజల విజయంగా భావిస్తూ ఈ సభలో వారికే అంకితం చేయనున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles