Bjp trying to strengthen in rajyasabha too

BJP trying to strengthen in Rajyasabha too, BJP second after congress in Rajyasabha

BJP trying to strengthen in Rajyasabha too

దిగువ సభలో విజయమే కానీ భాజపాకి ఎగువ సభలో...

Posted: 05/26/2014 02:29 PM IST
Bjp trying to strengthen in rajyasabha too

2014 సార్వత్రిక ఎన్నికలలో 282 లోక్ సభ స్థానాలను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ తన ఎన్డియే మిత్ర పక్షాలతో కలపి మొత్తం 336 స్థానాలను సంపాదించుకుని 543 సీట్లున్న దిగువ సభలో ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది కానీ ఎగువ సభకు ఈ సంవత్సరం మొదట్లోనే ఎన్నికలు అయిపోయాయి. తిరిగి 2016 వరకు ఎన్నికలుండవు.  

ప్రస్తుతం రాజ్యసభలో భాజపా కి చెందినవారు కేవలం 46 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. మరో 9 మంది ఎన్డియే మిత్రపక్షాలను కలుపుకున్నా 250 సీట్లున్న ఎగువ సభలో భాజపా సంఖ్య 55 కి మాత్రమే వచ్చింది.  అంటే సింపుల్ మెజారిటీ కావాలన్నా, ఇంకా 125 మంది ఎంపీల మద్దతు కావలసివుంటుంది.  కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజ్యసభలో 68 మంది ఎంపీలున్నారు.

అందువలన భాజపా ఎగువ సభలో కూడా తన సంఖ్యాబలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.  అందుకే కాంగ్రెస్ తర్వాత తమిళనాడులో ఎంపీల సంఖ్యాబలం ఉన్న జయలలిత మద్దతును భాజపా ఆశిస్తోంది.  మోదీ, రాజ్ నాథ్ సింగ్ కూడా జయలలితకు ఫోన్ చేసి అత్యధిక మెజారిటీ సంపాదించినందుకు అభినందనలు తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles