Afganistan presidents talks to modi

Afganistan presidents talks to Modi, Attack on Indian consulate in Ajghanstan, Modi condemns attacks in Afghanistan

Afganistan presidents talks to Modi on attack on Indian Consulate in Herat

దాడి మీద మోదీతో మాట్లాడిన ఆప్ఘన్ అధ్యక్షుడు

Posted: 05/23/2014 04:41 PM IST
Afganistan presidents talks to modi

భారత దౌత్యాలయం మీద జరిగిన కాల్పుల విషయంలో ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయి భారత ప్రధానమంత్రిగా అధికారాలు చేపట్టబోతున్న నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.  అంతకు ముందు ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడితో మాట్లాడుతూ దాడిచేస్తున్నవారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నందుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేసారు.  

ఆప్ఘనిస్తాన్ లో భారత దౌత్యాలయం మీద ఉగ్రవాదులకు, భద్రతా దళానికి మధ్య జరిగిన కాల్పులలో పరిస్థితిని అదుపులోకి తీసుకునిరావటానికి 10 గంటలు పట్టింది.  ఈరోజు ఉదయం 3.35 న ప్రారంభించి ఆప్ఘనిస్తాన్ లో హేరాత్ లోని భారత దౌత్యాలయం మీద మెషీన్ గన్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్ లతో ఉగ్రవాదులు కార్యాలయం పక్క భవనాల నుంచి కాల్పులు జరిపారు.  

గోడ పైకి ఎక్కి కాన్సులేట్ కార్యాలయంలోకి చొరబడే ప్రయత్నం చేసిన ఒక ఉగ్రవాది కాల్పుల్లో మరణించాడు.  ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ తో సహా 150 మంది భద్రతా దళాలు ఉగ్రవాదులను చుట్టుముట్టి 10 గంటలపాటు వాళ్ళ మీద కాల్పులు జరిపి పరిస్థితిని అదుపలోకి తీసుకునివచ్చారు.  

హేరాత్ లో కాల్పులను ఖండిస్తున్నానంటూ నరేంద్ర మోదీ ట్విట్టర్లో ప్రకటించారు.  పాకిస్తాన్ కూడా ఈ దాడులను ఖండించింది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles