Passengers faces hell by private meghana travels

Private Meghana Travels, Passengers faces hell, by Private Travels.

Passengers faces hell by Private Meghana Travels

అర్థరాత్రి నరకం చూపించిన 'మేఘన'

Posted: 05/23/2014 03:29 PM IST
Passengers faces hell by private meghana travels

నరకం అనేది ఎలా ఉంటుందో.. అనుభవించిన వారికే తెలుస్తోంది. నరకం, సుఖం అనే రెండు ఉంటాయి. సుఖాల కోసం మనిషి ఎప్పుడు పరితపిస్తుంటాడు. నరకం అంటేనే మనిషి పడదు. అక్కడ అన్ని బాధలే ఉంటాయి కాబట్టి. ఒక్కోసారి .. అనుకోకుండా మనం నరకం చూస్తాం. ‘‘సుఖం చెప్పి వస్తే.. నరకం చెప్పకుండా వస్తుంది’’. దేవుడ ప్రతి ప్రాణికి ఒక ఎక్స్ ఫైర్ తేదీని ముందుగానే ముద్రిస్తాడు. అది తేలిసి కూడా మనిషితో.. మనిషే ఆడుకుంటాడు. అందులో భాగంగానే.. కొంతమంది ప్రయాణీకులను.. అర్థరాత్రి మేఘన నరకం అంటే ఎలా ఉంటుందో చూపించింది. మేఘన .. అమ్మాయి కాదులేండి.. ఓ ప్రవేటు ట్రావెల్స్ పేరు మేఘన. అర్థరాత్రి ప్రైవేటు బస్సు బ్రేక్ డౌన్ అవడంతో ప్రయాణీకులు నడిరోడ్డుపై నానా అవస్థలు పడ్డారు.

ఆబస్సులో చిన్న పిల్లలున్న తల్లుల అవస్థలు వర్ణనాతీతం. వేరే బస్సును పంపించాలని ప్రయాణీకులు చెప్పినా ఆ ప్రైవేటు బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం చేసింది. చివరకు అదే బస్సును రిపేర్ చేసి గమ్యస్థానానికి తరలింది. పామూరు నుండి హైదరాబాద్ కు మేఘన ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. గుర్రంగూడ ప్రాంతానికి చేరుకోగానే బస్సు బ్రేక్ డౌన్ అయిపోయింది.

 

అప్పుడు సమయం తెల్లవారుజామున మూడు గంటలు. బస్సు రిపేర్ కు గురైందని డ్రైవర్ చెప్పాడు. వేరే బస్సును ఇక్కడకు వస్తుందని చెప్పారు. దీనితో ప్రయాణీకులు నడి రోడ్డుపై పడిగాపులు కాశారు. నడి రోడ్డుపై చిన్న పిల్లల తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడ్డారు. సుమారు ఆరు గంటల పాటు నరకయాతన పడ్డారు. చివరకు అదే మెఘన బస్సు రిపేర్ కావడంతో ప్రయాణీకులు మళ్లీ ప్రయాణం సాగించారు. ఇలాంటి నరకం చూపించిన చాలా ట్రావెల్స్ ఉన్నాయని .. ప్రయాణీకులు అనుకుంటూ.. వారి ఇళ్లకు వెళ్లిపోయారు.

ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఒక్కసారి ఆలోచించండి.? ప్రయాణికులు ఇచ్చే పైసల్ ముఖ్యం కాదు.. అందులో ప్రయాణించే ప్రయాణీకుల ప్రాణాలు ముఖ్యం అని తెలుసుకోండని ..ప్రతి ప్రయాణికులు అంటున్నారు. ఆ అర్థరాత్రి నరకంలో.. మీ బందువులు, మీ కుటుంబీకులు, మీ సన్నిహితులు, ఉండే పరిస్థితి ఏమిటి? ప్రయాణీకులను గమ్యం చేర్చండి.. అంతేగానీ వారిని ప్రాణాలను గాలిలో కలిపేయకండి?

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles