Drugs through nose

Drugs through nose give fast effect, Administrating nasal drugs gives good results, Brain drugs through nose

Drugs through nose give fast effect

ముక్కు ద్వారా మందులు

Posted: 05/23/2014 12:43 PM IST
Drugs through nose

నోటి ద్వారా తీసుకునే మందు మాత్రలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి శాపంలాగానే అనిపిస్తుంది.  దానికంటే ముక్కుద్వారా మందుని స్ప్రే చేసినట్లయితే అది మెదడులో చేరవలసిన భాగానికి చాలా త్వరగా చేరుతుంది.  ఈ విషయం మత్తు పదార్థాలు వాడే వాళ్ళను చూస్తే మనకు బాగా అర్థమౌతుంది.  డ్రగ్స్ వాడేవాళ్ళలో ముక్కు ద్వారా పీల్చేవారికి మత్తు క్షణాల్లో ఎక్కిపోతుంది.  మనదేశంలో ముక్కుపొడి కూడా ఒకప్పుడు బాగా ఉపయోగించేవారు.  పొగాకుతో తయారుచేసే నస్యం అనే ఆ మందుని పీల్చటం వలన వెంటనే మెదడుకి చేరి వాళ్ళకి ఆనందాన్ని కలుగజేస్తుండేది.  

సదరన్ డెన్మర్క్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ విధంగా త్వరితగతిని పనిచేసే మందుల మీద ప్రయోగాలు చేసారు.  విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ మాసిమిలియానో డి కాగ్నో ఈ విషయంలో మాట్లాడుతూ, మెదడుకి సంబంధించి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు పెద్ద మోతాదుల్లో మందులను వెంటవెంటనే ఇస్తుంటారు- అది కూడా దీర్ఘకాలం వరకు.  దీనితో వివిధ సమస్యలు ఎదురౌతాయి.  అందువలన దానికంటే సులభంగా ఔషధాలను ఇవ్వటం కోసం ముక్కు ద్వారా ముఖ్యంగా ముక్కులోని గోడ దాని మీద ఉండే పల్చని ముకోసా మీద మందుని చల్లటాన్ని అభివృద్ధి చేసారు.  అని అన్నారు.

మెదడుకి సంబంధించిన మందులను సులభంగా ఇవ్వటం కోసం చేసిన ప్రయత్నంలో ఇది చాలా మంచి మలుపు అన్నారు డాక్టర్ కాగ్నో. ఇక తర్వాత చెయ్యవలసిన పని అలాంటి మందులను కొరత లేకుండా అందుబాటులోకి తేవటం.  ఎందుకంటే దీర్ఘకాలంగా వ్యాధితో బాధపడుతూ గంటకోసారి మందు వేసుకోవలసిన పరిస్థితి ఉన్నప్పుడు ఇది చాలా సులువైన మార్గమని అన్నారాయన.  

ముక్కులోపలకి మందుని చల్లటం వలన అది ముక్కు లోపలి గోడకు చేరి అక్కడి నుండి మెదడులోకి వెళ్ళవలసిన భాగానికి వేగంగా చేరుతుంది బాగానే వుంది కానీ, ఈ లోపులో ముక్కులోపలి నుంచి కిందికి జారిపోకుండా ఉండటం కోసం ముక్కు గోడలకు అంటుకుని ఉండే విధంగా ఆ మందులో జిగురు పదార్థాన్ని కలపటం కూడా అంతే అవసరమంటూ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ లో ఆ పరిశోధకులు తెలియజేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles