Attack on afghanistan indian consulate

Attack on Afghanistan Indian Consulate, Four attackers on Indian consulate, Two suicide attackers died in Afghanistan, Firing is going on Indian consulate in Afghanistan

Attack on Afghanistan Indian Consulate

ఆప్ఘనిస్తాన్ లో భారత్ దౌత్యకార్యాలయం మీద దాడి

Posted: 05/23/2014 11:41 AM IST
Attack on afghanistan indian consulate

ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలోని ముఖ్య నగరమైన హేరాత్ లో నలుగురు ఉగ్రవాదులు మారణాయుధాలతో భారత దౌత్య కార్యాలయం మీద దాడిచేసారు.   ఇది ఇరాన్ సరిహద్దులో ఉన్న ప్రాంతం.  

కార్యాలయంలోని ఉద్యోగులంత క్షేమంగా ఉన్నారని, దుండగులను తరిమికొట్టటానికి ఎదురు దాడిలో భద్రతా సిబ్బంది ఉందని, న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్విట్టర్లో ప్రకటన చేసారు.  

హేరాత్ పోలీస్ ఛీఫ్ జనరల్ సమీహుల్లా క్వాత్రా ఈ ఘటన మీద మాట్లాడుతూ, కాన్సులేట్ కి సమీపంలో ఉన్న ఇళ్ళల్లో నలుగురు ఉగ్రవాదులు ఉదయాన్నే మారణాయుధాలతో వచ్చి చేరారని, వారిలో ఆత్మాహుతి దాడి చేసేవాళ్ళు కూడా ఉన్నారని, వాళ్ళు అక్కడినుంచి ఇండియన్ కాన్సులేట్ మీద కాల్పులు జరపటం మొదలుపెట్టారని చెప్పారు.  పరిసరాల్లోని నాగరికులను ఆ ఇళ్ళల్లోంచి ఖాళీ చేయించామని, కాల్పులు జరిపేవాళ్ళ మీద భద్రతా దళాల ఎదురు కాల్పుల కొనసాగుతున్నాయని కూడా ఆయన తెలియజేసారు.  

దాడిచేసిన నలుగురిలో ఇద్దరు ఆత్మాహుతి దళంవాళ్ళు మృతి చెందారని, ఒకతను గాయపడ్డాడని, నాలుగో మనిషి ఇంకా కాల్పులు జరుపుతూనేవున్నాడని ఆప్ఘన్ క్విక్ రియాక్షన్ ఫోర్స్ కమాండర్ మొహమ్మద్ నాసర్ పాష్టున్ ప్రకటించారు.  

ఈ దాడుల వెనుకనున్న సంస్థ గురించి కాని దాడుల లక్ష్యం గురించి కానీ ఇంకా ఏమీ తెలియలేదు.  ఆప్ఘనిస్తాన్ లో భారత దౌత్య కార్యాలయం మీద దాడి జరగటం ఇది మొదటిసారి కాదు.  2008 లో కాబూల్ లో ఆత్మాహుతి దాడి జరిగింది.  అందులో 50 మంది చనిపోయారు, ఎంతో మంది గాయపడ్డారు.  ఆ దాడి వెనక పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పనిచేసిందని అమెరికా అధికారులు, భారత అధికారులు కూడా ఆరోపించారు.

తూర్పు ఆప్ఘనిస్తాన్ ల జలాలాబాద్ లో పోయిన సంవత్సరం దాడి జరిగింది.  అయితే పోల్చి చూస్తే హేరాత్ ప్రాంతం మిగిలిన ప్రాంతాలకన్నా సురక్షితమని నమ్ముతూ వచ్చారు.  ఆప్ఘనిస్తాన్ లో అన్ని దౌత్య కార్యాలయాలు ఉండటం విషయంలో పాకిస్తాన్ ఎప్పటినుంచో అభ్యంతరాలు తెల్పుతూనేవుంది.  

(పై ఫోటోలో కాబూల్ లో భారత దౌత్యకార్యాలయం మీద ఆగస్ట్ 2013 లో జరిగిన దాడి)

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles