Shake hands spread diseases

shake hands spread diseases, Shake hands dangerous like public smoking, Microbes spread with shake hands

shake hands spread diseases

ఇతరులతో చేతులు కలపకండి, ఊపండి చాలు!

Posted: 05/22/2014 12:20 PM IST
Shake hands spread diseases

మన పాత సాంప్రదాయం ప్రకారం చేతులు జోడించి నమస్కరించటం కానీ  లేదా ఆధునిక విధానంలో హాయ్ అంటూ చెయి ఊపటం కాని చెయ్యండి కాని కరచాలనాలు చెయ్యకండని పరిశోధకులు అంటున్నారు.  కరచాలనాల వలన మైక్రోబ్స్ విస్తరించే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు.  

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెలెస్ లోని పరిశోధకులు, ముఖ్యంగా హాస్పిటల్స్ లో కరచాలనాలను తగ్గించేయాలని చెప్తున్నారు.  చేతులు కలవటం ద్వారా రోగుల నుండి మైక్రోబ్స్ చకచకా పాకే అవకాశముంటుందంటున్నారు.  

పరిశోధనలో లీడ్ ఆధరైన మార్క్ స్క్లానెస్కీ మాట్లాడుతూ, అంటు వ్యాధులు సోకటానికి చేతులు వాహకాలుగా పనిచేస్తున్నాయని, అందువలన చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవటం అవసరమని గుర్తించి ఆ దిశగా ఈ మధ్యకాలంలో హాస్పిటల్స్ లో అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు.  

కరచాలనం ద్వార వ్యాపించే పేథోజెన్ లు, వ్యాధుల విషయంలో ఇంకా లోతుగా పరిశోధిస్తేనే కానీ హాస్పిటల్స్ లో కరచాలనాలకు నిషేధాజ్ఞలు ఇవ్వలేమని అన్నారు.  అయితే మీడియా ద్వారా, విద్యావిషయాల కార్యక్రమాల ద్వారా అవగాహనను పెంచవచ్చని పరిశోధకులు అన్నారు.

రోగులు, వారికి సహాయంగా ఉండేవారి భద్రత కోసం కరచాలనాలను లేకుండా చెయ్యటం అవసరమని గుర్తించే సమయం వస్తుందంటూ జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో ప్రచురించటం జరిగింది.  పబ్లిక్ ప్లేసెస్ లో పొగతాగటం ఎంత చేటు చేస్తుందో కరచాలనం కూడా అంతే అంటున్నారు పరిశోధకులు

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles