దేశమంతా ఆయన అభిమానులు మోదీ మంత్రం జపించి ఆయనను అత్యున్నత స్థానంలో నిలబెట్టారంటే అది మోదీ వెనుకనుండి నడిపించిన ఆధ్యాత్మిక శక్తి, ఆయనలోని నిజాయితీ, నిబద్ధత, కార్యశీలతలే.
చిన్నతనం నుంచి పేదరికంలో పెరిగిన మోదీ తనకి అప్పజెప్పిన పనిలో మాత్రం నిబద్ధతను నిజాయితీని ప్రదర్శించేవారు. ఏ పనైనా సరే, ఎంత చిన్న పనైనా సరే దానికి పూర్తి న్యాయం చెయ్యటం ఆయన లక్షణంగా ఉండేది. అంతేకాదు ప్రతిపనిలోనూ ఆ పనిచేసే సామర్థ్యం, అందులో మెళుకవలను పెంచుకునే ప్రయత్నం చేసేవారాయన- అది చాయ్ అందించటమే కావొచ్చు, కార్లు తుడవటమే కావొచ్చు, ఆర్ఎస్ఎస్ లో పనిచెయ్యటమే కావొచ్చు, భాజపాలో పనిచెయ్యటమే కావొచ్చు, ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యటమే కావొచ్చు, ఒక జాతీయ పార్టీకి ఎన్నడూ ఎరుగని విజయాన్ని సాధించటంలో చేసిన కృషే కావొచ్చు.
ఆయన కారు తుడుస్తుంటే ఆ పద్ధతిని చూసి, ఆయనకు డ్రైవింగ్ నేర్పితే ఇంకా బాగా పనికివస్తాడన్న అభిప్రాయం యజమానికి కలిగేలా ఉండేది. 30 సంవత్సరాలు ఆయన జీవితంలో ఒకే సంచిలో తన వస్తువులు పెట్టుకుని ఎవరో ఒకరి ఇంట్లో వాళ్ళు పెట్టింది తినటమే కానీ, ఇది కావాలి, ఇలా ఉండాలి అని కోరుకున్నది లేదు.
మోదీ పుట్టిన వూరు వాద్ నగర్ ఒకప్పుడు బౌద్ధ క్షేత్రంగా విలసిల్లుతూ ఎప్పుడూ పదివేల మంది బౌద్ధ సన్యాసులకు ఆశ్రయం కల్పించిందని చైనా యాత్రికుడు హియాంగ్ సాంగ్ తన ఆత్మకథలో తన అనుభవంగా రాసారు. ఆ స్థల మహాత్యమేమో లేదా ఆయనకు మనసుకి పట్టిన వివేకానందుని ప్రసంగాల ప్రభావమేమో కానీ ఆయనలో ఆధ్యాత్మిక చింతన కలిగింది. ఆ సమయంలో సన్యసించుదామని నిర్ణయించుకున్న మోదీ దేశ ప్రధానిగా మారుతానని ఆయనే అనుకోనివుండరు.
తనలో చెలరేగుతున్న అనేకానేక ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవటం కోసం ఆయన హిమాలయాలకు పయనం సాగించారు. కానీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునే. చాయ్ దుకాణం నుంచి చాయ్ అందించగా వచ్చిన కాస్త సొమ్ము, అదనంగా నూనె డబ్బాలను మోసినందువలన వచ్చిన సొమ్మును తీసుకుని ఒక చేతి సంచీలో రెండు జతల దుస్తులతో ఇంటి నుంచి బయటకు వచ్చారు మోదీ.
బేలూరు రామకృష్ణ మఠంలో చేరుదామనుకుంటే కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలని చెప్పటంతో వెనుదిరిగారాయన. ఆ తర్వాత యోగులతో కలిసి ఆధ్యాత్మిక చర్చలు సాగించి, హిమాలయ ప్రాంతంలోని ఆల్మోరాలో వివేకానందుడు స్థాపించిన ఆశ్రమంలో సన్యాసం తీసుకోవలని అనుకున్నా, అక్కడా డిగ్రీ చదివితే కనీ అర్హత లేదని అనటంతో అక్కిడనుండి కూడా తిరిగి వచ్చేసారాయన. రాజ్ కోట్ లోని రామకృష్ణ మఠంలో మరోసారి ప్రయత్నించిన మోదీని ఇంకా అప్పటికి 19 సంవత్సరాలు కూడా నిండని పసిప్రాయంలోనే ఎన్నో ప్రశ్నలతో సతమతమవుతూ ఉండటం చూసిన స్వామీ ఆత్మాస్థానందజీ మోదీ లక్ష్యం సన్యాసంతో పూర్తవదని, ఆయన చెయ్యవలసిన బృహత్కార్యాలు ఇంకా చాలా వున్నాయని చెప్పి వెనక్కి తిరిగి పంపించేసారు.
కానీ రెండు సంవత్సరాలు దేశాటన చేసిన మోదీ తన గ్రామంలో రెండు రోజులు కూడా ఉండకుండానే తిరిగి అహ్మదాబాద్ వచ్చి అక్కడ ఆర్ఎస్ఎస్ లో చేరారు. అక్కడ ఆర్టీసీ క్యాంటీన్ లో చాయ్ అమ్ముతూ జీవనాన్ని సాగించారు.
ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగిన మోదీ అవసరమైనప్పుడు సలహా సంప్రదింపులు చేస్తూ పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నారు. అందులోంచి భారతీయ జనతాపార్టీ లోకి పంపించిందా సంస్థ. భాజపా ఆయనను 1987లో గుజరాత్ రాష్ట్రంలో నిర్వాహక కార్యదర్శిగా నియమించింది.
ఆ స్థానం నుంచి తన క్రమశిక్షణతోను, కార్యశీలతతోనూ తనకు అప్పగించిన ప్రతిపనిలోను పూర్తి న్యాయం చెయ్యటంతోనూ భాజపాలో ఎదుగుతూ, సాటి సభ్యుల ఈర్ష్యాసూయలను కూడా చవిచూసారాయన. దేనికీ బెదరకుండా తన పనిని సక్రమంగా చేసి ప్రతిపనిలోనూ అద్భుతమైన ఫలితాలను పొందారంటే దాని వెనుక ఆయన ఆలోచనా సరళి, దానికి మూలమైన ఆధ్యాత్మిక చింతనే కారణం.
ఆయన ముఖ్యమంత్రి అవాలని కలలు కనలేదు. 2001 లో గుజరాత్ లోని భూకంపం వలన అస్తవ్యస్తమైన పరిస్థితిలో అక్కడ పని చేస్తున్న సమయంలో ఆయన సామర్థాన్ని గమనించిన వాజ్ పేయ్ ఆయనను గుజరాత్ లో పోటీ చెయ్యమని అడిగారు. వద్దు కేవలం పరిస్థితులను చక్కబెట్టి వస్తాను అని మోదీ అంటే అద్వానీ పట్టుబట్టి ఆయనను ముఖ్యమంత్రిగా పోటీ చెయ్యమని చెప్పారు.
2002 లో జరిగిన అల్లర్లలో కేంద్ర సహాయం సకాలంలో అందక రాజకీయ పరిస్థితులు సరిగ్గా లేని సమయంలో మోదీ గడువుకు ముందుగానే శాసన సభను రద్దు చేసి తిరిగి ఎన్నికలకు సన్నిద్ధమయ్యారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన మళ్ళీ గెలుస్తారని ఎవరూ అనుకోలేదు. అది పెద్ద సాహసమే అనుకున్నారు. ఎన్నికల కమిషన్ కూడా సకాలంలో ఎన్నికలను నిర్వహించకపోవటంతో సుప్రీం కోర్టుకి వెళ్ళి మోదీ ఎన్నికలకు అనుమతులను తెచ్చుకున్నారు. అయితే అందరి అంచనాలనూ తల్లకిందులు చేస్తూ మోదీ గుజరాత్ లో అఖండ విజయాన్ని సాధించారు.
ముఖ్యమంత్రిగా మరోసారి పదవీ స్వీకారం చేసిన తర్వాత మోదీ గుజరాత్ అభివృద్ధి మీదనే దృష్టి సారించారు. పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టమని చెప్పారు. దాని వలన పార్టీ నుంచే వ్యతిరేకతలు తలెత్తినా చలించలేదాయన. 2002 తర్వాత మరోసారి మతకల్లోలాలు జరగకుండా చూసారాయన. 2012 లో మైనార్టీల వోట్లు అధికంగా లభించాయానకి.
నరేంద్ర మోదీ 14 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడే ఆయన జాతకం చూసి, ఆయన సన్యాసి అవుతాడు లేదా గొప్ప రాజకీయ నాయకుడౌతాడని భవిష్యవాణి చెప్పారట.
డిగ్రీ కనీస విద్యార్హత అని సన్యసించటానికి కూడా ఆంక్షలు పెట్టిన ఆశ్రమాల మీద కసి ఏమీ లేదు కానీ తనెందుకు ఆ పని చెయ్యగూడదు అని అనుకున్న నరేంద్ర మోదీ పట్టభద్రులు కూడా అయ్యారు. ఆర్ఎస్ఎస్ లో బట్టలుతకటం, గిన్నెలు కడగటం, భవనాలను శుభ్రం చేసే పనిచేస్తూనే ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో డిగ్రీ సంపాదించారు.
ఇంకా అబ్బురపరచే ఆయన జీవిత విశేషాలు ఎన్నో ఉన్నాయి కానీ పైన చెప్పుకున్నవాటితో మనం తెలుసుకోగలిగేది ఒకటే ఆయన నిబద్ధత, కార్యశీలతతో పాటుగా ఆధ్యాత్మిక శక్తి ఆయన వెనుకనుండి నడిపించివుండాలి. లేకపోతే ఆవిధంగా అడుగడుగునా స్వయంశక్తితో ఎదుగుతూ పోవటం సాధ్యం కాదెవరికైనా. ప్రతి సందర్భంలోనూ పనిచెయ్యటమే కాకుండా ఆ అనుభవాలలోంచి పాఠాలు నేర్చుకుంటూ జీవితంలో ఒక్కో మెట్టూ ఓపిగ్గా ఎక్కుతూ వచ్చిన మోదీ అందుకే, ఎన్నికలలో గెలిస్తే దేశ సేవ చేస్తాను, లేదంటే నేను తిరిగి చాయ్ అమ్ముకుని కూడా బ్రతకగలను అని ధైర్యంగా చెప్పారు.
నరేంద్ర మోదీ అనే రెండు పదాలలోంచి తీసుకుని 'నమో' అని అన్న ఆ పదం, ఈ రోజు ఢిల్లీలో విజయోత్సవ ర్యాలీ కోసం విచ్చేసిన మోదీకి ఘనస్వాగతం పలుకుతూ 'హర హర మోదీ' అని నినదించటం కూడా ఆయన వెనుక పనిచేస్తున్న ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తున్నాయి!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more