Governor orders probe on kishanbagh incident

Governor orders probe on Kishanbagh incident, Police firing in Kishanbagh Hyderabad, Governor ESL Narasimhan declares compensation to Kishanbagh victims, Kishanbagh incident probe with sitting High Court judge

Governor orders probe on Kishanbagh incident

కిషన్ బాగ్ ఫైరింగ్ మీద విచారణకు గవర్నర్ అదేశాలు

Posted: 05/15/2014 05:32 PM IST
Governor orders probe on kishanbagh incident

హైద్రాబాద్ లో కిషన్ బాగ్ లో జరిగిన అల్లర్లు, పోలీస్ ఫైరింగ్ మీద గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశాలు జారీచేసారు.  సంబంధిత పోలీసు అధికారులతో వివరణ తీసుకున్నారు.  ఈ ఘటనలో మృతిచెందినవారి కుటుంబానికి రూ.6 లక్షలు, గాయపడినవారికి వైద్య చికిత్స కాకుండా అదనంగా రూ.50,000.00 పరిహారాన్ని గవర్నర్ ప్రకటించారు.  ఆస్తినష్టం జరిగినవారికి కూడా నియమానుసారం పరిహారం అందుతుంది.  

బుధవారం రాజేంద్రనగర్ పరిథిలోని కిషన్ బాగ్ లో అర్షమహల్ లో ఇరు వర్గాల మధ్య మారణాయుధాలతో పోరాటం జరిగింది.  కారణం ఒక వర్గానికి చెందిన పతాకాన్ని మరొకరు కాల్చివేయటం.  పోలీసులు వచ్చినా ఎవరూ అదుపులోకి రాకపోవటంతో బిఎస్ఎఫ్ జవాన్లకు ఫైరింగ్ చెయ్యవలసివచ్చింది.  

కిషన్ బాగ్ లోని సిఖ్ ఛావని ప్రాంతంలో కొండ మీద ఒక వర్గం వారు, కొండ కింద మరో వర్గం వారు నివాసముంటున్నారు.  ఆ మధ్య భాగంలో తమ మత విశ్వాసానికి చెందిన జెండాను పాతగా మరో వర్గం వారు రాత్రికిరాత్రి దాన్ని దహనం చేసారు.  దీన్ని గమనించిన పోలీసులు పై అధికారులకు విషయాన్ని తెలియజేసి, ఇరు వర్గాలను ఎంత సముదాయించినా ఎవరూ అదుపులోకి రాకపోవటం, లాఠీ ఛార్జ్ కి కూడా బెదరకుండా పోరాటం సాగించటంతో ఫైరింగ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావలసివచ్చింది.  జెండ్ సమీపంలోని ఇళ్ళను దగ్ధం చెయ్యటమే కాకుండా వాహనాలను కూడా తగులబెట్టారు.  పోలీస్ కాల్పుల్లో ముగ్గుర మరణించారు, 12 మంది గాయపడ్డారు.  

పై సంఘటనను మొత్తాన్ని విచారణ చెయ్యటానికి హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ ని నియమించారు గవర్నర్ నరసింహన్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles