Bullet trains soon after modi comes to power

Bullet trains soon after Modi comes to power, Infrastructural development in NDA regime, 100 more town in India after Modi takes reigns, Brand India revival with Modi

Bullet trains soon after Modi comes to power

మోదీ రాగానే దేశంలో బుల్లెట్ ట్రైన్ లు !

Posted: 05/14/2014 10:02 AM IST
Bullet trains soon after modi comes to power

ఎన్డియే అధికారంలోకి వచ్చినట్లయితే మొట్టమొదటిగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా దేశంలో ఇన్ఫ్రా స్ట్రక్చర్ ని అభివృద్ధి పరుస్తూ పర్యాటక రైల్వే, హైవే ల అభివృద్ధి మీద దృష్టి సారించనున్నారు.  చైనా జపాన్ లలో లాగా మనదేశంలో బుల్లెట్ ట్లైన్లను ప్రవేశపెట్టటానికి రైల్వే మంత్రిత్వ శాఖకు ప్రాధాన్యతలుగా ఇవ్వనున్నారు.  

అయితే ఇందులో భారీగా పెట్టుబడుల అవసరం పడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ పాలసీ ప్రకారం 3పి లేదా 4 పిలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ లేదా పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ విధానంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే ఉద్దేశ్యంలో ఉన్నారు.  

ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్ మెంట్ లో ట్విన్ సిటీస్, శాటిలైట్ టౌన్స్ లాంటివి అభివృద్ధి చెయ్యటం కూడా మోదీ కలలలో ఒకటి.  దేశవ్యాప్తంగా మరో 100 నగరాలను తయారు చెయ్యాలన్నది మోదీ ఆశ.

ఇవే కాకుండా దేశం ఆర్థికంగా బలపడటానికి అవసరమైన చర్యలు తీసుకుని టాక్స్ ని సరళీకృతం చేసి, ప్రభుత్వం రంగంలో జాప్యం జరగకుండా, తద్వారా అవినీతికి అవకాశం లేకుండా చెయ్యటం కూడా మోదీ విధానాల్లో ఉంది.  

అంతర్జాతీయ రంగంలో కూడా భాజపా పెనుమార్పులకు చోటిస్తూ విదేశ సంబంధాలను మెరుగుపరచటం, 5 టి లైన ట్రెడిషన్, టాలెంట్, టూరిజం, ట్రేడ్, టెక్నాలజీల అభివృద్ధితో బ్రాండ్ ఇండియా ను పునరుద్ధరించే ఆలోచనలో ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles