Chandrababu warns against jagan activities

Chandrababu warns against Jagan activities, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014

Chandrababu warns against Jagan activities

నకిలీ మద్యం, నకిలీ నోట్లతో వోటర్లతో చెలగాటం!

Posted: 05/06/2014 09:37 AM IST
Chandrababu warns against jagan activities

సోమవారం ప్రచారానికి ఆఖరి రోజవటంతో కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో విస్తృతంగా పర్యటించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జగన్ కుయుక్తుల పట్ల ప్రజలను సావధానంగా ఉండమని హెచ్చరించారు. 

నకిలీ మద్యంతో పైకి పోవటం, నకిలీ వోట్లతో లోపలికి పోవటం జరుగుతుందని ఆయన అన్నారు.  నకిలీ మద్యం వలన ప్రాణాలు పోతాయని, నకిలీ నోట్ల వలన జైల్లోకి పోతారని ఆయన హెచ్చరించారు.  ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి జగన్ గద్దె ఎక్కుదామనుకుంటున్నారని చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు.  ఏరులా పారుతున్న మద్యంలో నకిలీ మద్యం చోటుచేసుకుంటుంటే ఎన్నికల కమిషన్, గవర్నర్, ఎక్సైజ్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.  

ఎవరి మతాన్ని వారు నమ్మవచ్చు, గౌరవించవచ్చు కానీ వైయస్ విజయమ్మ బైబిల్ ని చేతిలో పట్టుకుని సభలకు వస్తుంటారు.  దానితో ప్రజలకు ఏం సంకేతాలిస్తున్నట్లు అని చంద్రబాబు ప్రశ్నించారు.  చర్చిల్లో నోట్లు పంచుతున్నారు.  అది ఎంత నీచమైన చర్యో ఆలోచించండి అన్నారాయన.  అలాగే బ్రదర్ అనిల్ పేరుకు సువార్త సభలు, అందులో చెప్పేది వైకాపాకి వోటెయ్యమని.  ఇది ఎంత దుర్మార్గమో మీరో ఆలోచించండి అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles