Fake currency in distribution among voters

Fake currency in distribution among voters, Election 2014, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Fake currency in distribution among voters

నకిలీ నోటుతో వోటర్ కి టోకరా

Posted: 05/05/2014 09:06 AM IST
Fake currency in distribution among voters

నకిలీ నోట్లను చెల్లుబాటు చెయ్యటానికి వోటరు దేవుడు అడ్డంగా దొరికిపోయాడు.  మరీ దేవుడి హుండీలో వేసి మోసం చేద్దామనే ఉద్దేశ్యం లేకపోయినా వోటరు దేవుడు చేతిలో చకచకా కుక్కేసే నోట్లకి వాళ్ళు కక్కుర్తి పడతారని, ఆ తర్వాత వాళ్ళ వోటు తమదేనని ధీమాగా ఉన్న అనంతపూర్ నాయకులకు ఎదురు దెబ్బ తగిలింది.  వోటరు దేవుడు అవసరాల్లో ఉన్నవాడు కావటంతో చేతికి దొరికిన వెయ్యి రూపాయల నోటుని దుకాణానికి తీసుకునిపోయి కావలసినవి కొనుగోలు చేద్దామని ఆశపడ్డ వాళ్ళకి అది దొంగనోటని, అది చెల్లదని తెలిసిపోయింది.  

నిర్ఘాంతపోయిన వోటరు అధికారం రాకముందే ఇంత అన్యాయమా అంటూ ఆ నోటును మీడియా ముందు పెట్టి దాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చారని చెప్పాడు.  అనంతపురం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి కేంద్రాలుగా నకీలీ నోట్ల పంపిణీ గతంలో కూడా బాగా జరిగింది.  ఆకలిగావున్నవాడిని ఆప్యాయంగా పిలిచి పాచిపోయిన అన్నం పెట్టినట్లు భావిస్తున్నారు ఆ నోట్లు తీసుకున్నవారు.  వాటిని బయటకు తీయాలా వద్దా, నకిలీయో కాదో పరీక్షించుకోవటమెలా, పోలీసుల చేతికి కాని చిక్కాము కాదు అన్న భయాందోళనలతో చాలామంది ఆ నోట్లను బయటకు తీయటానికి సంశయిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులలో పట్టుబడ్డ రవాణాలోని కరెన్సీ నకిలీ నోట్లని చాలా సందర్భల్లో తేలింది.  అలా పట్టుబడని దొంగనోట్లను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నవారు, అది నకిలీ నోటని తెలిసిన రోజున వోటరు తమగురించి ఏమనుకుంటాడన్న భయం కూడా లేదు వాళ్ళకి.  తమని మోసం చేస్తున్న పార్టీకి వాళ్ళు వోటు వేస్తారా.  కొన్ని సందర్భాల్లో పంచమని ఇచ్చిన మంచి నోట్ల స్థానంలో కిందిస్థాయి నేతలు చేతివాటం చూపించి దొంగనోట్లు కూడా పంపిణీ జరిగివుండవచ్చు.  ఎన్నికలలో వోటరు ప్రలోభపెట్టటానికి నకిలీ నోట్లను ఉపయోగించటం నేరం కనుక రాత్రిపూట చీకటి చాటున జరిగే ఈ పంపిణీలో నకిలీ నోట్లను కలిపి పంచిపెట్టటం చాలా సులభం.  

దేశవ్యాప్తంగా పట్టుబడ్డ నకిలీ నోట్లలో చాలావరకు రూ.500, రూ.1000 ల నోట్లే.  దొరికినవాటినిబట్టి అంచనా వేస్తే 3200 కోట్ల రూపాయల ముఖ విలువగల దొంగనోట్లు ఎన్నికలలో చెలామణీ అయ్యాయని తెలుస్తోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles