Sonia gandhi fire on narendra modi 2014 election

sonia vs modi, sonia vs modi 2014, narendra modi, sonia gandhi, 2014 election, sonia gandhi election campaign 2014, 2014 pm post, pm chair, narenrda modi pm, sonia gandhi fire on modi, congress party, bjp.

sonia gandhi fire on narendra modi 2014 election

ఆయన మనసంతా దానిపైనే : సోనియా

Posted: 05/05/2014 09:06 AM IST
Sonia gandhi fire on narendra modi 2014 election

బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారం కోసం అమరవీరుల పేర్లను ఉపయోగించుకోవడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మండి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని కులులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల సభలో ఆమె మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో అమరుడైన కెప్టెన్ విక్రం బాత్రా ఇచ్చిన క్వొటేషన్ ‘యే దిల్ మాంగే మోర్’ను మోదీ ప్రధానమంత్రి పదవిని కైవసం చేసుకోవాలన్న దురుద్దేశంతో ఉపయోగించుకున్నారని నిప్పులు చెరిగారు.

‘హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల సభలలో మోదీ మాట్లాడుతూ కార్గిల్ యుద్ధ అమరవీరుడైన కెప్టెన్ విక్రం బాత్రా పేరును ఉపయోగించుకున్నారు. కెప్టెన్ బాత్రా క్వొటేషన్ ‘యే దిల్ మాంగే మోర్’ను తన పార్టీకి ఓట్లు సంపాదించి పెట్టడానికి ఉపయోగించుకున్నారు’ అని సోనియా ధ్వజమెత్తారు. ‘ఉన్‌కా (మోదీకా) దిల్ సిర్ఫ్ కుర్సీ మాంగ్ రహా హై (మోదీ హృదయం కేవలం ప్రధాని కుర్చీని కోరుకుంటోంది)’ అని ఆమె విమర్శించారు. మోదీ ఇలా ఎన్నికల ప్రచారంలో అమరవీరుల పేర్లను వినియోగించుకోవడం వారిని అవమానించడమే అవుతుందని ఆమె అన్నారు.

మోదీ తాను అధికారంలోకి వస్తే ఏదో ఒరగబెడతానని ప్రజలకు భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని సోనియా ఆరోపించారు. నిజానికి మోదీ ఎన్నుకున్న మార్గం విధ్వంసకర మార్గమని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎల్లవేళలా ఎలాంటి వివక్ష లేకుండా ప్రజాసంక్షేమానికి, సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ వస్తోందని ఆమె అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కాకుండానే, ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండానే మోదీ తాను ప్రధానమంత్రిని అయిపోయినట్లు మాట్లాడుతున్నారని సోనియా ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles