Railway protection force mechanical checks

Railway protection force mechanical checks, Indian railways vulnerable to terrorists, Security checks in railways, Twin blasts in Chennai Central

Railway protection force mechanical checks

రైల్వే తనిఖీలు యాంత్రికం, భద్రత ప్రశ్నార్థకం!

Posted: 05/02/2014 10:13 AM IST
Railway protection force mechanical checks

చైన్నై సెంట్రల్ లో జంట పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో అప్రమత్తమయ్యారు.  దాన్ని అప్రమత్తమయ్యారనేదానికంటే ఉలిక్కిపడ్డారనటం సరేమో.  ఎందుకంటే ఉలికిపాటు కాసేపే ఉంటుంది.  తిరిగి మామూలుగా సర్దుకుంటుంది.  

దేశ రాజధాని ఢిల్లీలో కూడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రిజర్వ్ పోలీస్ సహాయంతో ఉలికిపాటు తనిఖీలను ప్రారంభించిన కొద్దిసేపటికే చేతకాదంటూ చేతులెత్తేసారు.  కోటి ముప్ఫై లక్షల మంది యాత్రికులు ప్రతిరోజూ రైలులో ప్రయాణిస్తున్నారు.  అంతమందిని, వాళ్ళ చేతిలోని సామాన్లను తనిఖీ చెయ్యటం జరగని పని అన్నారు అధికారులు.  .  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విధుల్లో రైల్వే ఆస్తులను కాపాడటం ప్రముఖంగా ఉంది.

దేశవ్యాప్తంగా లక్షల కోట్ల ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చే రైల్వే సేవల్లో సమయాన్నే పాటిస్తారా, ప్రయాణ భద్రతనే చూస్తారా, సాంకేతిక లోపాలు లేకుండానే చూసుకుంటారా ఇవన్నీ కాకుండా ప్రయాణీకులనందరినీ అనుమానంగా చూసి తనిఖీలు చేయిస్తారా.  ఒకళ్ళను తనిఖీ చేస్తుంటే వందమంది తోసుకుని ముందుకు పోతుంటే ఆ ఒక్కళ్ళను చూసి కూడా లాభమేముంటుంది.  అనుమానస్పద ప్రవర్తన ఉన్నా లేదా సమాచారం అందినా చూడవచ్చేమో కానీ ప్రయాణీకులందరినీ చెక్ చెయ్యటం సాధ్యం కాని పని అంటూ అధికారులు వివరించారు.  

అందువలన ఆ రద్దీలో ఉగ్రవాదులకే కాక ఇంకా ఎందరో సంఘ విద్రోహులకు అవకాశం కూడా మెండుగా ఉంది.  చిల్లర దొంగతనాలు, దోపిడీలు, మోసాలు జరిగిన కేసులు ప్రతి సంవత్సరం విపరీతంగా పెరిగిపోతున్నాయి.  

మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సమస్య గా మారిన రైల్వే భద్రతకు పరిష్కారం ఒకటే- ఉగ్రవాద చర్యలను అరికట్టటం, వాళ్ళ ప్రయత్నాలను ముందుగానే వమ్ముచెయ్యటం.  అంతే కానీ రైల్వే ప్రయాణీకులందరినీ పట్టుకుని వాళ్ళని ఆమూలాగ్రం తనిఖీలకు గురిచెయ్యటం అసంభవమైన కార్యక్రమం.  సెక్యూరిటీ చెక్ లోంచి పోతున్నప్పుడు బీప్ బీప్ మంటూ గందరగోళంగా శబ్దాలు వచ్చినా అందరినీ పట్టించుకునే పరిస్థితి కనపడటం లేదు.  

అయితే ఒకటి- భద్రతా దళాలు మోహరించాయంటే వాళ్ళని చూసి అప్రమత్తమైన చిల్లర దొంగలు, మోసకారులు కొంత వరకు నిరుత్సాహపడవచ్చు.  కానీ ఉగ్రవాదుల విషయంలో అలా ఆలోచించటానికి వీల్లేదు.  ఎందుకంటే ప్రాణాలకు తెగించి ప్రాణాలుతోడే వారికీ, ప్రాణాలు నిలబెట్టుకోవటం కోసం అది కూడా తప్పే అయినా దోపిడీలు మోసాలకు పాల్పడేవాళ్ళకి చాలా తేడా ఉంది.  

రవాణాలో సామాన్య మానవులకు అందుబాటులో ఉన్న దేశంలో గుండెకాయలాంటి రైల్వే సేవలకు భద్రతా విషయంలో అధికారులు ప్రస్తుతానికి ఏం చెయ్యాలని తలలు పట్టుకోవటం తప్ప ఒక నిర్ణయానికి రాలేకపోయారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles