Twin blasts at chennai central railway station details

Twin blasts at Chennai Central, Bomb blasts at railway station details, Helpline for Chennai bomb blasts

Twin blasts at Chennai Central railway station details

చెన్నై సెంట్రల్ లో జంట పేలుళ్ళ వివరాలు

Posted: 05/01/2014 12:12 PM IST
Twin blasts at chennai central railway station details

ఈ రోజు ఉదయం 7.15 కి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో 9 వ నంబర్ ప్లాట్ఫాం మీద ఆగివున్న బెంగళూరు గౌహతి ఎక్స్ ప్రెస్ లో ఎస్ 4, ఎస్  లలో జంట పేలుళ్ళు సంభివించాయి.  అందులో గుంటూరుకి చెందిన స్వాతి అనే మహిళ మృతి చెందినట్లుగానూ విశాఖపట్నానికి చెందిన మహిళ గాయపడ్డట్టుగాను సమాచారం.  

వివరాలకు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్- 044 2535 7398.

బుధవారం చెన్నైలో అరెస్టైన ఐఎస్ఐ ఉగ్రవాది జాకీర్ హుస్సేన్ కి ప్రతిస్పందనగా ఆ ఉగ్రవాద సంస్థనుంచి బాంబు దాడులు జరుగుతాయని పోలీసులు ఊహించినదే.  అందుకే అప్రమత్తంగా ఉన్నా ఈ సంఘటన చోటుచేసుకుంది.  ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా భారత్ లోకి ప్రవేశిస్తున్నారని పోలీసుల దగ్గర సమాచారం ఉంది.  

ఈ సంఘటనమీద తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య దిగ్బాంతిని, ముఖ్యమంత్రి జయలలిత పరిహారాన్ని ప్రకటించారు.  చనిపోయిన స్వాతి కుటుంబానికి లక్ష రూపాయలు, గాయపడినవారికి 50 వేలు, స్వల్పగాయాలైనవారికి 25 వేల రూపాయల పరిహారాన్ని జయలలిత ప్రకటిస్తూ దర్యాప్తుకు ఆదేశాలిచ్చారు.  

బాంబు దాడికి లోనైన బోగీలను తొలగించి ఆ స్థానంలో కొత్త బోగీలతో రైలుని బయలుదేరదీసారు.  

బాంబు దాడులు నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో పలు రైల్వే స్టేషన్లో విస్తృతంగా నిర్వహించిన తనిఖీలలో విజయవాడ జంక్షన్ లో పది నాటు బాంబులు దొరికాయి.  ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ సభ జరుగనున్నందున నెల్లూరులో నిఘా పెంచిన పోలీసులకు అనుమానస్పదంగా రైల్వే స్టేషన్లో లభించిన సూట్ కేసు కాసేపు కలవరపరచింది.  అది విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న పినాకినీ ఎక్స్ ప్రెస్ లో డి-8 కోచ్ లో 42 వ బెర్త్ కింద ఎవరికీ చెందని సూట్ కేస్ కనపడింది.  దాన్ని ప్లాట్ ఫాం మీదకు దించిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ ని పిలిపించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles