Bjp narendra modi interview with tv channel

BJP Narendra Modi interview with TV Channel, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

BJP Narendra Modi interview with TV Channel

పాతకేసులను తిరగదోడాలా, లేక కొత్తగా అవినీతి జరగకుండా చూడాలా

Posted: 04/19/2014 08:20 AM IST
Bjp narendra modi interview with tv channel

పాతకేసులను తిరగదోడాలా, లేక కొత్తగా అవినీతి జరగకుండా చూడాలా అన్నది ఆలోచించవలసిన విషయమని, శక్తి యుక్తులను, సమయాన్ని దేనికోసం కేటాయించాలన్న నిర్ణయం తీసుకోవలసివుందని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఒక టివి ఇంటర్వ్యూలో తెలియజేసారు. 

అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా, సాంకేతిక పరిజ్ఞానంతో, పారదర్శకమైన పాలనను చేస్తూ ఆదర్శవంతమైన వ్యవస్థను స్థాపించటమే లక్ష్యంగా పెట్టుకోవాలని తన అంతరాత్మ చెప్తోందని మోదీ అన్నారు.  దాన్ని మళ్ళీ రాజనీతి చెయ్యగూడదన్న మోదీ, తన మీద అవినీతి ఆరోపణలు వచ్చినా వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి విచారణ జరిపేందుకు తాను సంపూర్ణంగా సహకరిస్తానని అన్నారాయన. 

ఢిల్లీ జామా మస్జిద్ షాహి ఇమామ్ ని సోనియా గాంధీ కలవటాన్ని తప్పు పట్టిన భాజపా అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ముస్లిం మతస్తులను ఎలా కలిసారు అని అడిగిన ప్రశ్నకు, ఎవరు ఏ కులస్తులనైనా కలవవచ్చని, కానీ ఒక వర్గం వారి వోటు అడగటాన్ని మాత్రమే తప్పు పట్టటం జరిగిందని, అది రాజ్యాంగ విరుద్ధమని మోదీ సమాధానమిచ్చారు.  ఎవరు ఎవరితో భేటీ అయ్యారన్నది కాదని, బయటకు వచ్చిన సందేశం ముఖ్యమని అన్నారాయన. 

నేను హిందువులకో ముస్లింలకో మరే ఇతర కులస్తులకో వోటు కోసం ప్రత్యేకంగా విజ్ఞప్తి చెయ్యటంలేదు.  నేను విజ్ఞప్తి చేసేది 125 కోట్ల భారతీయులకు.  అది వాళ్ళకి నచ్చితే సరి.  నచ్చకపోతే నన్ను ఓడిస్తారు అంతే అన్నారు మోదీ. 

ఆర్ఎస్ఎస్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, భారత దేశంలో అతి పెద్ద ఏకైక స్వచ్ఛంద సంస్థని, ఓడిపోతున్నప్పుడలాల ఆ సంస్థ మీద బురదజల్లే పని కాంగ్రెస్ చేస్తునేవుంటుందని, పదేళ్ళలో కాంగ్రెస్ దేశాన్ని సర్వనాశనం చేసిందని, మన్మోహన్ సింగ్ ని పక్కన పెట్టి సోనియా రాహుల్ గాంధీలు దేశాన్ని దోచారని, అటువంటి యుపిఏ ప్రభుత్వాన్ని పడగొట్టాలని, భాజపాకి కనీసం 300 సీట్లు తక్కువ రాకుండా వోటర్లు సహకరిస్తే అది సాధ్యమౌతుందని ఆయన అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles