Harish rao objects sonia gandhi comments on trs

Harish rao objects Sonia Gandhi comments on TRS, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Harish rao objects Sonia Gandhi comments on TRS

గెలిచింది రాముడైతే గంతులేసింది కోతులు!

Posted: 04/19/2014 07:38 AM IST
Harish rao objects sonia gandhi comments on trs

తెలంగాణా రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు హరీష్ రావు సిద్ధిపేటలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గెలిచింది రాముడైతే గంతులేసింది కోతి మూకలంటూ తెలంగాణా సాధించింది తెరాస అయితే కాంగ్రెస్ నాయకులు కోతుల్లా గంతులేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. 

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో తెరాస పాత్ర ఏమీ లేదంటూ కరీంనగర్ లో సోనియా గాంధీ మాట్లాడిన మాటలను ఖండిస్తూ, అనివార్యంగా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వవలసిన అగత్యం పట్టబట్టే రాష్ట్ర విభజనను చేసారని చెప్తూ, కెసిఆర్ ఆమరణ దీక్ష చేసినప్పుడు కేంద్ర మంత్రి చిదంబరం డిసెంబర్ 9 న ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందన్న ప్రకటనను చేసిన విషయాన్ని గుర్తుచేసారు. 

కెసిఆర్ జైలుకెళ్ళారు, 13 సంవత్సరాలు తెలంగాణా కోసం పోరాడారు, రావణుడిమీద విజయం సాధించినట్లుగా దుష్ట శక్తుల నుంచి తెలంగాణాను రక్షించుకున్నారు ప్రత్యేకతను సాధించారు.  రాముడిలా పోరాడి సాధించకుంటే అది రాముడి గెలుపే అవుతుంది కానీ, వానరుల విజయం కాదని, కాంగ్రెస్ నేతలు ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుందామని చూస్తున్నారని, కానీ వానరమూకలాంటి కాంగ్రెస్ దా గెలుపు కాజాలదని హరీష్ రావు అన్నారు.   

ఎన్నికలలో కాంగ్రెస్ కి ఓటమి తప్పదని, ఆ నిరాశలోనే టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కెసిఆర్ మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారని, అయితే కాంగ్రెస్ కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హరీష్ రావు అన్నారు.  తెలంగాణా కోసం చేసిన బలిదానాలను గుర్తుచేస్తూ, 1200 మంది అమరుల సూసైడ్ నోట్స్ ఉన్నాయని, వాటిని కావాలంటే జైరాం రమేష్ చూడవచ్చని, ఢిల్లీలోనే యాదిరెడ్డి తెలంగాణా కోసం ప్రాణత్యాగం చేసినప్పుడు ఈ జైరాం రమేష్ కనీసం చూడటానికైనా రాలేదని, అటువంటి వాళ్ళకి తెలంగాణా గురించి మాట్లాడే హక్కే లేనప్పుడు తెలంగాణా సాధన గురించి ప్రగల్భాలు చెప్పుకోవటం కూడదని హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles