Kcr rally at warangal

KCR rally at Warangal, Sonia Gandhi Rally at Karimnagar, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

KCR rally at Warangal, Sonia Gandhi Rally at Karimnagar

సోనియా సభ అట్టర్ ఫ్లాప్-సురేఖ సభకు ఎక్కువ జనం వస్తరు

Posted: 04/18/2014 08:44 AM IST
Kcr rally at warangal

కరీం నగర్ లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బహిరంగ సభ అట్టర్ ఫ్లాపైందంటూ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు గురువారం వరంగల్ లో జరిగిన ఓరుగల్లు గర్జన కార్యక్రమంలో అన్నారు.  ఈ విషయాన్ని పోలీస్ ఇంటెలిజెన్స్ కూడా చెప్పిందని అన్నారు కెసిఆర్.  అంతేకాదు సురేఖ సభకు అంతకంటే ఎక్కువ జనం వస్తారంటూ కెసిఆర్ ఎద్దేవా చేసారు.

సభకు వచ్చినవారికి ఎంత వినోదం పంచిపెడితే అంత గొప్ప వక్త అనిపించుకుంటారు.  సభికులను ఆకట్టుకోవాలి, అలా అని పార్టీ ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకోవాలి.  స్థానిక నాయకులను పొగడాలి, తన స్థాయిని కూడా కాపాడుకోవాలి.  ఇవన్నీ దండిగా ఉన్న కెసిఆర్ సభకు అందుకే ఎక్కువమంది హాజరవుతారు. 

సోనియా గాంధీ సభ విజయవంతం కాలేదని చెప్పటం ఓరుగల్లు గర్జన సభ ఉద్దేశ్యం కాదు కానీ తన ప్రత్యర్థి అపజయాన్ని గొప్పగా చెప్పటం కూడా రాజకీయాలలో భాగమే.  ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చెయ్యటమే ఆ మాట ఉద్దేశ్యం.  మిగతా స్థానాల్లో ప్రజలు ఎవరికి మద్దతునిస్తున్నారన్నది అవసరం కాకపోయినా, దాని ప్రభావం తప్పకుండా వాళ్ళ మనసుల మీద పడుతుంది.  అందుకే ఎన్నికలు మొత్తం అయ్యేంత వరకు ఫలితాలను వెల్లడించరు.  స్థానిక ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటించకపోవటానికి అదే కారణం.  దాని ప్రభావం సార్వత్రిక ఎన్నికల మీద పడుతుందేమో అని. 

కరీంనగర్ లో సోనియా గాంధీ సభకు ఆట్టే స్పందన లేదు అని చెప్పటం ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజాభిప్రాయం అలా ఉంది అని చెప్పి వీళ్ళకి కూడా మానసికమైన సూచన చెయ్యటం.  కాంగ్రెస్ పార్టీ సభ మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు, యుపిఏ ఛైర్ పర్సన్, అన్నిటికన్నా మిన్న ఉద్దేశ్యం ఏమైనా తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం కోసం పట్టిన పట్టు విడువని సోనియా గాంధీకి జనాకర్షణ లేదని చెప్పటం వలన వరంగల్ వోటర్లను ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభావితం చెయ్యటమే అవుతుంది. 

సమయం చాలా విలువైంది కాబట్టి తక్కువ పదాలలో ఎక్కువ ప్రయోజనాన్ని పొందాలి కాబట్టి స్థానిక నాయకుల మద్దతును కూడా కూడగట్టుకునే ఉద్దేశ్యంలో కొత్తగా తెరాస లో చేరిన కొండా సురేఖ ప్రస్తావన తీస్తూ, ఆమె సభకు అంతకంటే ఎక్కువమంది జనం వస్తారని అన్నారు కెసిఆర్.  ఆమె సభకే- అని అనటంలో తన స్థాయి అంతకంటే ఎక్కువన్న భావన కూడా అందులో ఉంది. 

ఒకవేళ కాంగ్రెస్ సభ అట్టర్ ఫ్లాపే అయినా అది ఇంకా రాజకీయంగా మంచిదేగా.  దాన్ని చెప్పుకోవలసిన అవసరం ఏముంది అంటే పైన చెప్పినట్లుగా అక్కడి స్థానిక వోటర్లను మానసికంగా ప్రభావితం చెయ్యటం.  అలాగే పొన్నాల లక్ష్మయ్యకు నాయకత్వ లక్షణం లేదని కూడా కెసిఆర్ విమర్శించారు.  కాంగ్రెస్ పార్టీ తన దగ్గరున్న నాయకులలో సమర్ధుడని నమ్మి పొన్నాల లక్ష్మయ్యకు పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టింది.  ఆ నాయకుల సమర్ధతను కొలవటం మరో పార్టీకి అవసరమా.  సమర్ధుడైతే ఆ పార్టీకి ప్రయోజనం కలుగుతుంది, కాకపోతే ఆ పార్టీకే ప్రయోజనం తక్కువగా ఉండవచ్చు.  దాన్ని బహిరంగ సభలో చర్చించటం అవసరమేనా అంటే పైన చెప్పుకున్నట్లుగా లాభపడదలచుకుంటే అది అవసరమే. 

ఏం చెప్పినా చివరకు తను చెప్పదలచుకున్న ముఖ్యమైన విషయాన్ని చక్కగా వివరించగలిగే కెసిఆర్, శాసన సభకు ఎలాగూ ఎక్కువ స్థానాలు వస్తాయి గెలుస్తాము అన్న ధీమాను వ్యక్తం చేస్తూనే 17 లోక్ సభ స్థానాలు కూడా తెరాసకే వస్తే కేంద్రంలో కూడా తెలంగాణా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరి అడ్డూ లేకుండా రాష్ట్రానికి మేలు చెయ్యవచ్చన్న విషయాన్ని సభికులకు వివరించారు. 

అయితే కేంద్రం రాష్ట్ర విభజన చేసేసిందిగా ఇంకే పని అని అనుకోకుండా, పోరాటం ఇంకా అయిపోలేదని, సమస్య పూర్తిగా తీరలేదని, ఆంధ్రోళ్ళతో జాగ్రత్తగా ఉండాలని, ఆశించిన తెలంగాణా ఇంకా దక్కలేదని కెసిఆర్ ఎన్నికల ప్రచారంలో జరిగిన సభల్లో ప్రసంగిస్తూ వస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles