Mahesh babu supports tdp jayadev

galla jaya dev, Guntur, Mahesh Babu, TDP, prince maheshbabu,prince role model galla jayadev, Mahesh brother in law, TDP,Mahesh Babu, Jayadev, Election 2014 , Lok sabha polls, Telangana

galla jaya dev, Guntur, Mahesh Babu, TDP, prince maheshbabu,prince role model galla jayadev, Mahesh brother in law

టీడీపీకే మహేశ్ బాబు మద్దుతు

Posted: 04/17/2014 04:56 PM IST
Mahesh babu supports tdp jayadev

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇఫ్పటి వరకు ఎప్పుడు రాజకీయాల గురించి కానీ, తన మద్దతు పలానా పార్టీకి ఇస్తానని చెప్పలేదు, మాట్లాడలేదు. అలాంటి మహేష్ బాబు ఇన్ని సంవత్సరాల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ  తన మద్దుతు ఎవరికనే దాని పై తొలిసారిగా నోరు విప్పి, తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

తన మద్దతు బావ జయదేవ్ కే ఉంటుందని, తన ఓటు టీడీపీకే అని, తనకు చిన్నప్పటి నుండి రోల్ మోడల్ జయదేవ్ బావనే అని, తానెప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండేవాణ్ణ్ని. కానీ బావకోసం రాజకీయాల పై నోరు విప్పుతున్నానని చెబుతూనే... నేను 13 సంవత్సరాల వయస్సులో అక్క పద్మను జయదేవ్ పెళ్ళి చేసుకున్నాడని, అప్పటి నుండి బావ తన పట్ల చూపిన ప్రేమ, శ్రద్దకు నేను ముగ్దుణ్ని అయి పోయానని, జయదేవ్ దూర ద్రుష్టి, విలువలు ఆచరణలో ఎలా మలచాలో నేర్పించాడని అన్నారు.

జయదేవ్ రాజకీయాల్లోకి వెళ్తానని ఎప్పుడూ అనేవాడని, రాజకీయాలతోనే మార్పు సాధ్యమని జయదేవ్ నమ్మకమని, జయదేవ్ ఆశయాలను విశ్వసిస్తున్నానని, తాను ఆశిస్తున్న మార్పును జయదేవ్ తేగలరని నమ్ముతున్నానని, అందుకే నా మద్దతు జయదేవ్ కే అని, నా ఓటు టీడీపీకే అని, తన అభిమానులు కూడా జయదేవ్ కే ఓటు వేయాలని గుంటూరు ప్రజలను కోరారు. గతంలో గల్లా ఫ్యామిలీ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మహేశ్ బాబు ఆ పార్టీకే మద్దతు ఇచ్చేవాడు. వైయస్ హయాంలో క్రిష్ణ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉండేది, కానీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ గల్లా ఫ్యామిలీ ఇప్పుడు టీడీపీలో చేరడంతో మహేశ్ కూడా తన అభిప్రాయాన్ని భావ కోసం మార్చుకున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles