ఇంతవరకూ మనదేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలియని సరికొత్త రాజకీయ కేళిలో, తను అనుకున్న సిద్ధాంతపు పరిధిలో, పెట్టుకున్న లక్ష్యం వైపు పవన్ కళ్యాణ్ స్థిరంగా అడుగులు వేస్తున్నారని ఆయన జనసేన పార్టీని స్థాపించిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు చెప్పిన మాటలు, చేసిన పనులను నిశితంగా చూస్తే మనకు అర్ధమౌతుంది.
మామూలుగా చూస్తే ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణంలో పవన్ కళ్యాణ్ హడావిడిగా పార్టీని ప్రకటించటం, మళ్ళీ పోటీ చెయ్యనని అనటం, ఆవేశంగా మాట్లాడటం, ఇదంతా ఏదో తెలివితక్కువ పిల్లవాని చేష్టలుగా కనిపిస్తాయి కానీ విశ్లేషించి చూస్తే ఆయన మాట్లాడిన ప్రతి మాట, వేసిన ప్రతి అడుగు వెనుక నిర్దష్టమైన దిశ, నిర్దేశాలు కనిపిస్తాయి.
పవన్ కళ్యాణ్ వస్తూనే ఏదో చేసెయ్యాలి, 24 గంటల విద్యుత్తు, అందరికీ ఉపాధి, ఇళ్ళు లాంటి పెద్ద పెద్ద మాటలేమీ మాట్లాడలేదు. నేను వచ్చిందే ప్రశ్నించటానికి అని చెప్పారాయన. ఏవో పిల్ల చేష్టలతో మాట్లాడే మాటల్లే అవి అని కొందరు కొట్టిపారేస్త్, పోనీలే మనకేమీ అడ్డురాడులే అని కొందరు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ వ్యూహంలో భాగమే!
"ఎన్నికల్లో పోటీ చెయ్యాలి, ప్రజలకు హామీలివ్వాలి, వీలయితే అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చెయ్యాలి, అధికారాన్ని చేజిక్కించుకోవటం కోసం అవసరమైతే మిగతావారితో పొత్తులు ఒప్పందాలు చేసుకోవాలి కానీ ఈ ప్రశ్నించటమేమిటి తెలివితక్కువ వేషాలు కాకపోతే" అనుకున్నారు వివిధ పార్టీలలోని అధికశాతం రాజకీయ నాయకులు.
కోట్లలో కాస్తున్న పందెం కాబట్టి రాజకీయాల్లో ఇతరుల ప్రవేశాన్ని మొదట్లోనే అడ్డుకుంటారు రాజకీయ నాయకులు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయాల్లో ప్రమాదకరమైన మనిషిలా కనిపించలేదు, ఎన్నికల హడావిడి మధ్యలో పట్టించుకోదగ్గ వ్యక్తిగా అనిపించలేదు. అలా అనుకుని తనమీద పడకుండా ఉండాలన్నదే పవన్ కళ్యాణ్ వ్యూహం! లేకపోతే ప్రజారాజ్యం పార్టీ పెట్టగానే దాన్ని తుదముట్టించేంత వరకూ పట్టువిడవకుండా వెనకబడ్డట్టుగా జనసేనను కూడా శైశవదశలోనే అంతమొందిస్తారని పూర్వానుభవం వలన తెలుసాయనకు. అందుకే, ఆవేశంగా మాట్లాడినా ప్రమాదకరమైన వ్యక్తిగానూ, ఎవరికీ వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లుగానూ ప్రకటించలేదు- ఒక్క కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమని తప్ప!
ఇంతకీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్నదేమిటి?
ఆదర్శప్రాయమైన వ్యవహారశైలితో, సమర్ధవంతంగా నాయకత్వం వహించేవారికి మద్దతునిస్తానని జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చెప్పినట్లుగానే పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ తన మద్దతునిస్తున్నారు.
నరేంద్ర మోదీ విషయానికొస్తే ఆయన ఏ పార్టీ అన్నది పక్కన పెడితే, వ్యక్తిగతంగా నాయకత్వ లక్షణాలతో పాటు దేశానికి మంచి చెయ్యాలని, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ, ముఖ్యమంత్రిగా పనిచేసి గుజరాత్ అభివృద్ధిని షోకేస్ లో పీస్ గా చూపిస్తున్న వ్యక్తి.
అలాగే లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ నారాయణ! రాష్ట్రంలో ఎవరిని అడిగినా, జెపికున్న విశ్లేషణాత్మకమైన పరిజ్ఞానం, నిర్దిష్టమైన అభిప్రాయాలు, రాజనీతి రాజకీయాలకంటే ఎక్కువగా రాజ్యాంగం మీద, చట్టం మీద ఉన్న పట్టు విషయంలో ఎవరికీ అనుమానం లేదు. మరి ఆయనెందుకు విజయాన్ని సాధించలేకపోతున్నారు అని అడగొచ్చు. అందుకు కారణం రాజకీయాలు డబ్బుతో ముడిపడ్డవి, కోట్లలో ఆడే పందేలుగా మారిపోవటమే.
అందుకే వీళ్ళిద్దరికీ పవన్ కళ్యాణ్ సమర్థత లభిస్తోంది కాని వాళ్ళు పనిచేస్తున్న పార్టీల వలన కాదు. ఈరోజుల్లో కేవలం ఆదర్శంతో రాజకీయాల్లోకి రాగలిగే పరిస్థితి లేదు. కోట్లు గుమ్మరించాల్సిందే. ఈరోజు ముక్కుకు సూటిగా పోయే జెపి వలన దేశంలో రాత్రికి రాత్రే తేడా రాకపోవచ్చు. కానీ అటువంటివారికి పవన్ కళ్యాణ్ లాంటి అభిమానుల అండదండలున్న వ్యక్తి సమర్థన తెలియజేయటం వలన అటువంటి వారు ఇంకా కొందరు పుడతారు, సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారు.
ప్రస్తుతమున్న రాజకీయాలు ఒక్కసారిగా మారేవి కావు. అందుకే "మీ రాజకీయాలు మీరు చేసుకోండి నేను మాత్రం ప్రశ్నిస్తాను, తప్పు చేస్తే తాట తీస్తాను" అని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. మరి తెలుగుదేశం పార్టీతో సఖ్యతగా ఉన్నట్లుగా కనిపిస్తున్నా, అది కేవలం భాజపాతో కలసి ఎన్నికలలో పనిచెయ్యటం వలనే కానీ పవన్ కళ్యాణ్ తన మనోఫలకం మీద మోదీ, జెపిల సరసన చంద్రబాబుని కూర్చోబెట్టలేదు. అయితే ఒక్కసారే వ్యతిరేకత చూపిస్తే ప్రరాపాకి పట్టిన గతే తన పార్టీకీ పడుతుందని, నక్కజిత్తుల బాబుతో పెట్టుకుంటే ఎల్లో జర్నలిజంతో జనసేన భ్రూణ హత్యకు పాల్పడతారని తెలుసు. అందుకే ఎవరిని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచే ముందుకు సాగుతున్నారాయన.
మరి జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో నడుస్తున్న లోక్ సత్తాను ప్రత్యర్థ పార్టీలు ఎందుకు ఉపేక్షిస్తున్నారూ అంటే, ఆ పార్టీ నుండి పెద్దగా పోటీ, దాని వలన నష్టమేమీ కనిపించటం లేదన్నదే కాకుండా, "ఎంతైనా మనవాడే కదా" అని కులానికి విలువిచ్చే పార్టీ వైఖరి కూడా కారణమే!
పవన్ కళ్యాణ్ కోరుకునేది మంచి నాయకులు. సమాజంకోసం నిజంగా పనిచేసేవారు. మోది, జెపిలతో పోలిస్తే పివిపి కేవలం డబ్బులున్న వ్యాపారవేత్త అంతే! మరి పవన్ కళ్యాణ్ ఆదర్శంలో పివిపిలాంటి వాళ్ళకి చోటెక్కడుంది అంటే, మంచి పనికైనా డబ్బు అవసరమే, దాన్ని పెట్టటానికి పివిపి సిద్ధమే! రాబిన్ హుడ్ సిద్ధాంతంలా, ఉన్నవారి దగ్గర తీసుకుని మంచి పనికి ఉపయోగించటంలో (దోచుకోవటం లేదుగా!) తప్పు లేదు. అయితే, ఇది ఎవరికి తప్పుగా కనిపిస్తుందంటే, రాజకీయరంగంలో అభ్యర్థుల దగ్గర పార్టీ టికెట్ డబ్బులను 30 నుంచి 40 కోట్ల వరకు తీసుకునేవారికి! "అంత మంచి మార్గముండగా రాచమార్గంలో సంపాదించక ఇలా అడిగి తీసుకోవటమేమిటి?" అని వాళ్ళ ప్రశ్న.
పవన్ కళ్యాణ్ ఏం ఆచరిస్తారో అదే చెప్తారు, ఏం చెప్తారో అదే చేస్తారు కనుక, డబ్బు తీసుకుని నీతి మాలిన మనుషులకు పార్టీ టికెట్ ఇవ్వటం లాంటి పనులకు పోలేదు. చె గూవెరా లాంటి విప్లవనాయకుల గుండెల్లో పెట్టుకునే పవన్ కళ్యాణ్ డబ్బు చేసుకోవటానికి రాజకీయాలలోకి రాలేదు, అధికారం కోసం రాలేదు, కేవలం ప్రశ్నించటానికే రాజకీయాలలోకి వచ్చానని చెప్తున్నప్పుడు తను ఎన్నుకునేవాళ్ళు కూడా అలాంటివాళ్ళే అయ్యుండాలి కదా! అందుకే మోది, జెపి లాంటివాళ్ళని తను మద్దతునివ్వటం కోసం ఎన్నుకున్నారాయన.
పవన్ కళ్యాణ్ చేస్తున్న పనిలో ఈ సమయంలో బాగా గమనించాల్సింది ఒకటే. పార్టీలకు అతీతంగా మంచి నాయకులకు సమాజం కోసం సేవ చేసే వారికి ఆయన మద్దతునిస్తానంటున్నారు. దాన్ని ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా పార్టీలతో సంబంధం లేకుండా సరైన నాయకుడు అనుకున్నవాళ్లకి వోటు వేస్తే డబ్బుతో ముడిపడ్డ రాజకీయ వైఖరి మారిపోతుంది.
ఇప్పుడున్న నాయకులను మించినవారు లేక కాదు కానీ, డబ్బు పెట్టే స్తోమతు లేక మంచి నాయకులు పోటీకి దిగలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అటువంటి నాయకులకు మద్దతుగా నిలిచి, వోటర్లు కూడా పార్టీలకు, వాటి ప్రలోభాలకు పడిపోకుండా సరైన నాయకుడినే ఎన్నికలలో గెలిపించినట్లయితే జెపి లాంటి నాయకులు మరికొందరు ముందుకొస్తారు. అప్పుడు సమాజోద్ధరణ దానంతటదే సంభవిస్తుంది.
ఇదే పవన్ కళ్యాణ్ తను స్థాపించిన జనసేన పార్టీ ద్వారా పనిచేస్తూ మనకు చూపిస్తున్న ఆదర్శం, చేస్తున్నమార్గదర్శనం!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more