Janasena candidates contesting in this elections

janasena candidates contesting in this elections, janasena party, Election 2014, Lok sabha elections, Vijayawada, TDP, Janasena, Kesineni Nani, PVP,

janasena candidates contesting in this elections, janasena party, Election 2014, Lok sabha elections, Vijayawada, TDP, Janasena, Kesineni Nani, PVP,

బెజవాడ సహా మరో ఆరు స్థానాల్లో జనసేన

Posted: 04/16/2014 07:24 PM IST
Janasena candidates contesting in this elections

టాలీవుడ్ సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో ‘జన సేన ’ పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. పార్టీ స్థాపించిన తరువాత విజయవాడ సభలో ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయదు.. తన పార్టీ మద్దతు బీజేపీకే అని తెలిపిన విషయం తెలిసిందే.

కానీ అనూహ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ ఎంపీ స్థానం నుండే కాకుండా మరో ఆరు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. విజయవాడ ఎంపీ టిక్కెట్టు తన సన్నిహితుడు పీవీపికి ఇప్పించాలని పవన్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టిన విషయం తెలిసిందే.

దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు, పీవీపీ మద్దతు దారులు తెదేపా నుండి పోటీ చేస్తున్న కేశినేని నానికి ధీటుగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయాలని డిసైడ్ అయ్యినట్లు సమాచారం. వీరే కాకుండా మరో ఆరుగురు అభ్యర్థులు కూడా బరిలో దిగే విషయం పై పవన్ తో సమావేశం నిర్వహించారట. ఈ సమావేశంలో పవన్ వారి అభ్యర్థనకు అంగీకరించినట్లు చెబుతున్నారు.

ఓ వైపు బీజేపీ-టీడీపీలకు మద్దతు ఇస్తానని చెప్పి, ఇప్పుడు చాపకింద నీరులా ఆ పార్టీకే ఎసరు పెట్టాలని చూస్తున్న జనసేన పార్టీ అభ్యర్దులు నామినేషన్ వేసే వరకు వేచి చూడాల్సిందే. ఒక వేళ పీవీపీ కనుక నామినేషన్ వేస్తే విజయవాడలో పోరు రసవత్తరం ఖావడం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles