Kejriwal meets his attacker auto driver

Kejriwal meets his attacker auto driver, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014, Auto driver Lally attacks Kejriwal, Attacks on Arvind Kejriwal,

Kejriwal meets his attacker auto driver

తనపై దాడి చేసిన వ్యక్తిని కలిసిన కేజ్రీవాల్

Posted: 04/09/2014 02:45 PM IST
Kejriwal meets his attacker auto driver

అరవింద్ కేజ్రీవాల్ తనపై దాడిచేసిన ఆటో డ్రైవర్ లాలిని హాస్పిటల్ లో కలిసి మాట్లాడారు.  ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వాహకుడు కేజ్రీవాల్ మీద ర్యాలీలు రోడ్ షోలలో అనేకమార్లు దాడి జరిగింది.  ఢిల్లీ సుల్తాన్ పురిలో చేసిన దాడిలో కేజ్రీవాల్ మద్దతుదార్ల చేతిలో చావు దెబ్బలు తిని హాస్పిటల్ పాలైన లాలిని చూడటానికి వెళ్ళారాయన. 

ఆరోజు రోడ్ షోలో కేజ్రీవాల్ కి దండవేసి మరీ దవడమీద కొట్టిన ఆటోడ్రైవర్ లాలి కేజ్రీవాల్ ని చూడగానే భోరుమని ఏడ్చి తాను పెద్ద తప్పు చేసానని, తనని క్షమించమని కోరుకున్నాడు.  అతని కుటుంబ సభ్యులు కూడా, లాలి ఆఆపా అభిమానని, ఆ రోజు అలా ఎందుకు ప్రవర్తించాడో అర్థం కావటం లేదని అన్నారు. 

కేజ్రీవాల్, తన మీద దాడి చేసిన వారిని దండించవద్దని, వాళ్ళని కొడితే వాళ్ళకీ మనకీ తేడా ఏమిటని అన్నారాయన.  ఆ తర్వాత ఢిల్లీ దక్షిణపురిలో తన మీద దాడి చేసిన అబ్దుల్ వాహిద్ ని కూడా కలిసిన కేజ్రీవాల్, రాజకీయ ప్రత్యర్థుల వ్యూహం ప్రకారమే ఆ దాడులు జరిగాయన్నారు.

దీనికి సంబంధించిన వార్తా కథనం

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles