Aap contesting for 426 mp seats

AAP contesting for 426 MP seats, Arvind Kejriwal, AAP Secretary Pankaj Gupta, 2014 general elections

AAP contesting for 426 MP seats, Arvind Kejriwal, AAP Secretary Pankaj Gupta, 2014 general elections

అందరికంటే ఎక్కువ స్థానాల్లో ఆఆపా పోటీ

Posted: 04/03/2014 12:42 PM IST
Aap contesting for 426 mp seats

ఇది వినటానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా, అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ వయసు 15 నెలలే కానీ 2014 ఎన్నికల్లో, దిగ్గజాలైన కాంగ్రెస్ పార్టీ కంటే, భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది. 

భాజపా 415 స్థానాల్లోను కాంగ్రెస్ పార్టీ 414 స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా ఆఆపా 426 స్థానాల నుంచి పోటీ చెయ్యటం జరుగుతోంది.   ఉత్తర్ ప్రదేశ్ నుంచి అత్యధికంగా 80 స్థానాల నుంచి పోటీ చేస్తున్న ఆఆపా ఇతర రాష్ట్రాలలో చేస్తున్న పోటీ ఇలా ఉంది- మహారాష్ట్ర- 48, బీహార్-39, మధ్యప్రదేశ్- 29, కర్నాటక-28, రాజస్థాన్-24, తమిళనాడు-23, గుజరాత్-21, ఒడిశా-19, కేరళ-15, పంజాబ్-13, జార్ఖండ్-11, హర్యానా-10, ఢిల్లీ- 7 స్థానాల నుంచి పోటీ చేస్తోంది.  అందులో చాలా స్థానాల్లో మొత్తం స్థానాలలో పోటీ జరుగుతోంది. 

ఆఆపా కి ఉన్న పెద్ద ఇబ్బంది ఆర్థిక సమస్య.  కేవలం 20 కోట్ల రూపాయలే ఉండటంతో అన్ని స్థానాలలోని అభ్యర్థులకు సహాయంగా నిలిచే పరిస్థితి లేనందున అందరినీ ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రచారం గురించి ఏర్పాటు చేసుకోమని, అధిష్టానం నుంచి ఏమీ ఆశించవద్దని చెప్తోంది. 

పార్టీ నుంచి ఏమీ ఆశించవద్దన్న సంగతి ముందుగానే అభ్యర్థులకు చెప్పామని చెప్తున్న ఆఆపా జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా జాతీయ పార్టీగా గుర్తింపు పొందటం కోసం 400 కి పైగా స్థానాల్లో పోటీ చెయ్యటం జరుగుతున్నదని, నియమం ప్రకారం కనీసం నాలుగు రాష్ట్రాలలో జరిగిన పోలింగ్ లో 6 శాతం సాధించటమే ఉద్దేశ్యమని అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles