Congress candidate denied hoarding place in vadodara

Congress candidate denied hoarding place in Vadodara, BJP Narendra Modi, Congress Vadodara candidate Madhusudan Mistri, Vadodara municipal authorities

Congress candidate denied hoarding place in Vadodara

వడోదర లో కాంగ్రెస్ కి ప్రకటనలకు స్థలం లేదు!

Posted: 04/03/2014 04:45 PM IST
Congress candidate denied hoarding place in vadodara

భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వడోదర లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారానికి హోర్డింగ్ పెట్టుకోవటానికే స్థలం లేకపోయింది.  అందుకు కారణం భాజపా నెల రోజుల క్రితమే ప్రధాన కూడళ్ళలోని అన్ని హోర్డింగ్ స్థలాలను బుక్ చేసుకోవటం జరిగింది.  దానితో అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి మదుసూదన్ మిస్త్రి మున్సిపల్ అధికారులను కలిసి, ఇది చాలా అన్యాయమని, మోదీతో సమానంగా తనకీ ప్రకటనలకు స్థలం కావాలని పట్టుబట్టారు.  అయితే మున్సిపల్ అధికారులు అదేమీ కుదరదని తేల్చి చెప్పారు. 

అంతటితో ఊరుకోకుండా మిస్త్రి గారు మోదీ ఉన్న భాజపా ప్రకటనను తీసివేసి ఆ స్థానంలో తన సొంత ప్రచారం కోసం పోస్టర్ ని అంటిద్దామని చూసారు.  అది కనిపెట్టిన పోలీసులు ఆయన ప్రయత్నానికి అడ్డు తగిలారు.

భాజపా ఏర్పాటు చేసుకున్న హోర్డింగ్ లు మొత్తం వెయ్యి వరకున్నాయి.  దానితో వడోదరలో కాంగ్రెస్ అభ్యర్థికి పోస్టర్ అంటించటానికి స్థలం లేకుండా పోయింది.  అంతకు ముందులా ఎక్కడబడితే అక్కడ అంటించటానికి కూడా లేదు.  నియమాల ప్రకారం ఏ గోడమీదనైనా అంటించాలన్నా రాయాలన్నా ఆ ఇంటి యజమాని అనుమతి తీసుకోవటం తప్పనిసరైంది. 

అయితే మంచికో చెడుకో కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారమైతే జరిగింది.   ఫలానా మనిషి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు అన్న విషయం ఈ వార్త వలన వడోదర లో అందరికీ తెలిసిపోయింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles