Municipal poll results to ba announced on april 9

Municipal poll results on April 9, High Court of AP orders on Municipal results, Election Commission, Court interference after election process starts, Municipal results influence on general elections

Municipal poll results to ba announced on April 9 as announced earlier High Court orders

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏప్రిల్ 9 నే

Posted: 04/01/2014 04:30 PM IST
Municipal poll results to ba announced on april 9

ఈ రోజు మున్సిపల్ ఎన్నికల ఫలితాలను వెలివరచే విషయంలో వాదోపవాదనలను విన్న హైకోర్టు ధర్మాసనం పోయిన నెలలో ఇచ్చిన ఉత్తర్వులకు అనుకూలంగానే ఏప్రిల్ 9 న ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాలను కూడా విడుదల చెయ్యవలసిందిగా ఆదేశించింది. 

నగరపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికల మీద ప్రభావాన్ని చూపుతాయని, దానివలన ఎన్నికలు వోటర్ల మీద ప్రభావం లేకుండా స్వచ్ఛందంగా జరిగినట్లు కాదని ఎన్నికల కమిషన్ వాదన.  అయితే ఎన్నికల కమిషన్ వాదనను పరిశీలించకుండా ఉండలేమన్న హైకోర్టు పరిశీలనానంతరం వోటర్లు ప్రభావితమవుతారన్న వాదనతో ఏకీభవించలేదు.  అది అసంబద్ధమని తేల్చింది. 

వోటు మీద తనకంటూ ఒక అభిప్రాయానికి రాని వ్యక్తి వోటుకి అనర్హుడని హైకోర్టు తేల్చింది.  ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోలేవని, అందువలన పోయిన నెలలో చేసిన ప్రకటన ప్రకారం ఏప్రిల్ 9 న ఎన్నికల ఫలితాలను వెల్లడించాలని తీర్పునిచ్చింది. 

వోటర్లు ఎండ వేడికి కూడా వెరవకుండా పోలింగ్ లో పాల్గొన్నారు.  మహిళలు కూడా ఎక్కువ ఉత్సాహంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవటం కనిపించింది.  చెదురు మదురు సంఘటనలు, అక్కడక్కడా వోటర్ల పేర్లు జాబితాలో లేకపోవటం జరిగింది.  అయినా అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 70 శాతం పోలింగ్ నమోదైంది. 

ఎగ్జిట్ పోల్ సర్వేలలో ప్రసిద్ధి గాంచిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే ప్రకారం సీమాంధ్రలో తెలుగు దేశం పార్టీ, తెలంగాణా లో కాంగ్రెస్ పార్టీలకు గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందని అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles