Bifurcation of the state is not totally done says undavalli arun kumar

bifurcation of the state is not totally done says Undavalli Arun Kumar, Former Rajahmundry MP Undavalli, Lagadapati Rajagopal pepper spray, Article 3 of Indian Constitution,

bifurcation of the state is not totally done says Undavalli Arun Kumar

విభజన జరగలే జరగలే- ఉండవల్లి

Posted: 04/01/2014 04:11 PM IST
Bifurcation of the state is not totally done says undavalli arun kumar

ఇప్పటికీ రాష్ట్ర విభజన జరగనట్లుగానే భావిస్తున్నానంటూ రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ ఈ రోజు విజయవాడ లో జరిగిన మీట్ ది ప్రెస్ సమావేశంలో అన్నారు.  ఈ విషయానికి మద్దతుగా తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణా రాలేదు అన్న మాటలను ఉటంకించారు ఉండవల్లి. 

అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కలిసిపోయినట్లయితే పార్లమెంట్ లో ఎలాంటి నేరాలు, ఎంతటి ఘోరాలు జరిగినా బయటకు తెలియవని ఉండవల్లి అన్నారు.  తెదేపా ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీద జరుగుతున్న దాడిని ప్రతిఘటించటానికి వెళ్ళిన లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే ని వాడవలసివచ్చిందని చెప్తూ ఉండవల్లి పార్లమెంట్ లో జరిగిన దాడి బాపతు క్లిప్పింగ్ ని చూపించారు. 

కేంద్ర ప్రభుత్వం చేసిన రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టికిల్ 3 ని సవరణ చెయ్యకుండా రాష్ట్ర విభజన చెయ్యటం చట్ట విరుద్ధమని వేసిన పిటిషన్ కి మద్దతుగా సుప్రీం కోర్టులో స్వయంగా వాదించటం కోసం సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ లో నమోదు చేయించుకున్న ఉండవల్లి తెలంగాణా బిల్లు మీద చివరి వరకూ పోరాడుతానని అన్నారు. 

అలగే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం కోసం పోరాటం చేసిన కిరణ్ కుమార్ ని కూడా ఉండవల్లి ప్రశంసించారు.  తన జీవితాన్నే పణంగా పెట్టిన కిరణ్ కుమార్ ఆ విధంగా అధిష్టానానికి ఎదురు వెళ్ళకపోతే రోశయ్య, షీలా దీక్షిత్ లా ఎక్కడో ఏదో ఒక రాష్టానికి గవర్నరై యుండే వారని  అన్నారు ఉండవల్లి. 

ఎన్నికలకోసం పార్టీలు చేస్తున్న హామీల ప్రస్తావన తీస్తూ ఉండవల్లి, ఈ విషయంలో తెదేపా వైకాపాలను విమర్శించారు.  ఆచరణ సాధ్యంకానీ వాగ్దానాలు చేస్తున్నారంటూ  ఆ రెండు పార్టీలనూ నిరసించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles