Padma awards on by president of india

Padma awards on by President of India, Padma Vibhushan Raghunada Ananta Mashelkar, Kamala Haasan Padma Bhushan, P Gopi chand, Actress Vidyabalan Padmasri,

Padma awards on by President of India, Padma Vibhushan Raghunada Anantha Mashelkar, Kmala Haasan, Vidya Balan

ప్రభుత్వం గుర్తించిన 'పద్మ' లు రాష్ట్రపతి చేతుల మీదుగా

Posted: 04/01/2014 08:19 AM IST
Padma awards on by president of india

ఉగాది పర్వదినాన రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ లో పద్మ పురస్కారాలను రాష్ట్రపతి చేతుల మీదుగా గ్రహీతలు అందించారు.  గణతంత్ర దినాన ప్రకటించిన 127 పద్మ పురస్కారాలలో సోమవారం 66 మందికి పురస్కార ప్రదానం జరిగింది.

భారత రత్న తర్వాత స్థానంలో ఉండే పద్మ విభూషణ పురస్కారాన్ని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రఘునాధ అనంత మాషేల్కర్ గ్రహించారు. 

విలక్షణ నటుడు కమల హాసన్, బ్యాడ్మింటన్ ఆటగాడు పి గోపీచంద్ మరో పది మందికి పద్మ భూషణ పురస్కారం లభించింది.

హిందీ నటి విద్యా బాలన్, కబడ్డీ జట్టు కోచ్ సునీల్ దబాన్, సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్, సామాజిక కార్యకర్త జవహర్ లాల్ కౌల్ ఇంకా మరో 50 మంది మొత్తం 53 మందికి పద్మశ్రీ పురస్కారాలందించారు. 

పురస్కారాలు అందుకున్నవారిలో దివంగతులైన అనుమోలు రామకృష్ణ ప్రీకాస్ట్ కాంక్రీట్ సాంకేతిక అభివృద్ధిలో అత్యంత సేవలనందించినవారు.  వారికి మరణాంతర పద్మ భూషణ పురస్కారం వారి కుటుంబ సభ్యులకు అందించారు.  అయితే దివంగత ప్రధాన న్యాయమూర్తి జెఎస్ వర్మకు ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని ఆయన కుటుంబ సభ్యులు గ్రహించటానికి తిరస్కరించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles