Rayapati sambasiva rao joins tdp

Rayapati Sambasiva Rao joins TDP, Congress MP Rayapati Sambasiva Rao, Rayapat brothers join TDP, Nannapaneni Rajakumari, Galla Jayadev

Rayapati Sambasiva Rao joins TDP

తెదేపాలోకి రాయపాటి సోదరులతో పాటు కార్యకర్తలు

Posted: 04/01/2014 07:23 AM IST
Rayapati sambasiva rao joins tdp

గుంటూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నాలుగుసార్లు గెలిచిన రాయపాటి సాంబశివరావు, ఆయన తమ్ముడు రాయపాటి శ్రీనివాస్ లతో పాటు ఊకుమ్మడిగా అధిక సంఖ్యలో వారి మద్దతుదారులు, కార్యకర్తలు తెలుగు దేశం పార్టీలో చేరారు. 

అందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీమాంధ్ర కోసం రాయపాటి చేసిన పోరాటాన్ని శ్లాఘిస్తూ ఇక కాంగ్రెస్ పేరు చెప్తే ప్రజలు తన్నే స్థితికి వచ్చారన్నారు.  అలాగే ఆ కాంగ్రెస్ తో పాటు కుమ్మక్కై పనిచేసిన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజలు సరైన బుద్ధిచెప్తారని అన్నారు. 

సీమాంధ్ర అభివృద్ధి కోసమే అనునిత్యం ఆలోచిస్తున్నానని చెప్పిన చంద్రబాబు సీమాంధ్రను ప్రపంచ పటం లోకి తీసుకుని వస్తానమి మాటిచ్చారు.  సీమాంధ్రను జపాన్ సింగపూర్ ల స్థాయికి తీసుకురాగలిగే శక్తి ఒక్క చంద్రబాబు నాయుడికే ఉందన్న రాయపాటి సాంబశివరావు తన వంతుగా గుంటూరు జిల్లలో 17 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు తెదేపాకే వస్తాయని మాటిచ్చారు. 

ఈ సందర్భంగా గల్లా జయదేవ్ కి కూడా చంద్రబాబు పార్టీ కండువా కప్పారు.  ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఇంకా ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles