Kavitha satirical comments on pawan kalyan

Kavita satirical comments on Pawan Kalyan, Pawan Kalyan Janasena party, Telangana Jagruthi Kavitha, Telangana Rashtra Samiti, K Chandrasekhara Rso

Kavita satirical comments on Pawan Kalyan

పవన్ కళ్యాణ్ మీద పంచ్ లు

Posted: 03/27/2014 03:44 PM IST
Kavitha satirical comments on pawan kalyan

జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని మెచ్చుకున్నవాళ్ళే చాలమంది వున్నారు.  ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమని చెప్పారు కానీ ఆయన ఎవరినీ విమర్శించలేదు.  ఎవరినీ అగౌరవంగా సంబోధించలేదు.  పోతన రాసిన భాగవతం తెలంగాణాకు చెందిన కవి రాసింది, అందులో పదజాలం తెలంగాణా తెలుగే అన్న పవన్ కళ్యాణ్ నాలుకలు కోస్తా, బొందలు పెడతా, మెడలు వంచుతా, నరుకుతా అనే పదాలు ప్రత్యేకంగా తెలంగాణా తెలుగు పదాలు కావని అన్నారు. 

పవన్ కళ్యాణ్ తనని విమర్శించిన వాళ్ళని కూడా గౌరవప్రదమైన సంబోధనతో ప్రసంగంలో చేర్చటం అర్థం కాని వాళ్ళలో తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు తెరాస తరఫున ఎన్నికలలో పోటీ చేస్తున్న కవిత ఉన్నారు. 

బుధవారం ఒక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గురించి కవిత అన్న మాటలలో, రెండు గంటలు మాట్లాడినా పవన్ కళ్యాణ్ ఏం చెప్పదలచుకున్నాడో అర్థం కాలేదని అన్నారు.  ప్రజల మనిషని చెప్పి ఫైవ్ స్టార్ హోటల్లో సభను నిర్వహించటాన్ని ఆమె తప్పు పట్టారు.  ప్రజల సమస్యలను తీర్చటానికి ప్రజల దగ్గరకే పోవాలి కానీ హోటల్లో మీటింగా అని విమర్శించారామె.  అంటే ప్రజల కోసం పనిచేస్తున్నవారెవరైనా తమకి ఆ తాహతున్నా సరే ప్రదర్శించకుండా కనిపించేట్టుగా ఖర్చు పెట్టకుండా ఉండాలన్నమాట, వీలైతే చినిగిన చొక్కా వేసుకుని పోతే సమస్యలలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి స్వాంతన కలిగించటమౌతుందేమో అంటున్నారు అది చూసిన పవన్ అభిమానులు.  అంతే కాదు, నువ్వు అక్కడే ఉండు పైకి రాకు, నీతో మాట్లాడాలంటే నేనే కిందికి వస్తా అన్నట్లుగా ఉందని కూడా అన్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని సినిమాలలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ తో పోలుస్తూ సీరియస్ గా సినిమా నడుస్తున్నప్పుడు హాస్యం ప్రదర్శించినట్లుగా రాష్ట్రంలో రాజకీయాలతో వేడెక్కిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక హాస్యరసాన్ని పోషించే పాత్రధారిగా ప్రవేశించారంటూ ఛలోక్తి విసిరారు.  ఎన్నికల ముందు మేకప్, తర్వాత పేకప్ చెప్పటం చిరంజీవి తర్వాత మళ్ళీ సరిగ్గా ఎన్నికల సమయానికి వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చాడంటూ వ్యంగాస్త్రాలు వదిలారు కవిత.  అయితే, అదే నిజమని నిజంగానే నమ్మినట్లయితే పవన్ కళ్యాణ్ గురించి సుదీర్ఘంగా మాట్లాడాల్సిన అవసరమే లేదేమో, అంటే ఏదో మూల పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తారనే భయం ఉండే ఉండాలి, ఆయన వలన రాజకీయంగా ఏ ఆపదా లేదనుకున్నవారు ఎక్కడో ఏదో కార్యక్రమంలో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడరు అని కూడా పవన్ అభిమానులు కవిత మాటలకు అర్ధాలు వెతుకున్నారు.

అమ్మా నా గురించి మీ కెందుకు, మీ సంగతి మీరు చూసుకోండి, మీరు మీ ప్రజలకు చేసిన వాగ్దానాలు, వారి దగ్గర తీసుకున్న చందాలకు జవాబు చెప్పండి అని అన్న పవన్ కళ్యాణ్ మాటలు నిజంగానే అర్థమవలేదని ఆమె మాటలలోనే అర్థమవుతుందని వాళ్ళు వ్యాఖ్యానించారు. 

ఇంతకీ ఆమె ఏం మాట్లాడారో ఈ వీడియో చూడండి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles