Pawan slogan raised in chiranjeevi meeting

Pawan slogan raised in Chiranjeevi meeting, Congress bus yatra Anantapur, Chiranjeevi speech at Anantapur, Pawan Kalyan Janasena party, Congress party

Pawan slogan raised in Chiranjeevi meeting

చిరంజీవి ప్రసంగంలో జై పవన్

Posted: 03/27/2014 04:40 PM IST
Pawan slogan raised in chiranjeevi meeting

చిరంజీవి ప్రసంగం మధ్యలో జై పవన్ అని పవన్ కళ్యాణ్ అభిమానులు నినాదం చెయ్యటంతో ఆయన షటప్ అంటూ విసుగును ప్రదర్శించారు. 

సీమాంధ్ర ప్రచార సారధిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ కాంగ్రెస్ బస్ యాత్రలో అనంతపూర్ చేరుకుని అక్కడ రాజకీయ ప్రసంగం చేస్తున్న కేంద్ర మంత్రి చిరంజీవికి పవన్ అభిమానుల వ్యవహారం అసహనాన్ని తెప్పించింది.  జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ సభ, చిరంజీవి పని చేస్తున్నది కాంగ్రెస్ పార్టీకి.  అలాంటప్పుడు బహిరంగంగా కాంగ్రెస్ హటావో అని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తావన అక్కడ తేవటం వలన ఎవరికి మేలు జరుగుతుందన్నది అభిమానులు ఆలోచించ వలసిన విషయం. 

అందుకే, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి వాళ్ళు మాట్లాడబోతుంటే, ఆ ప్రస్తావన ఇక్కడ తేవటం సరికాదంటూ చిరంజీవి వాళ్ళని షటప్ అని కోప్పడ్డారు.  అంతేకాదు, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను కూడా అక్కడి నుండి తీసేయవలసిందిగా ఆయన కోరారు. 

అభిమానులు సరే, వాళ్ళకి పవన్ కళ్యాణ్ మీద ప్రేమాభిమానాలు ఉండటం సబబే కానీ అన్నయ్యంటే గుండెల నిండా గౌరవం ఉందని అన్న పవన్ కళ్యాణ్ మాటలకు కూడా వాళ్ళు విలువివ్వాలి కదా.  ఏదైనా సందర్భోచితంగా ఉంటేనే అందం.  అలా చిరంజీవికి ఆ సందర్భంలో చికాకు కలిగించటం వలన పవన్ కళ్యాణ్ కి కానీ, చిరంజీవి కి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ జనసేనకి కానీ ఏమైనా ప్రయోజనం కలుగుతుందా అన్నది ఆలోచించి వుంటే అభిమానులు అలా చేసుండేవారు కాదన్నది తెలుస్తోంది. 

వేరే వారి వలన తమ మధ్య అంతరాలను పెంచుకునే వాళ్ళు కాకపోవచ్చు కానీ ఇలాంటి సంఘటనల వలన కుటుంబ సభ్యులలో మనస్తాపమైతే కలుగుతుందన్నదాంట్లో అనుమానం లేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles