Conditional bail to subrata roy

Conditional bail to Subrata Roy, Supreme Court of India, SEBI, Subrata Roy to Deposit Rs 10000 crore, Sahara Group owes Rs 20000 crore to investors

Conditional bail to Subrata Roy

బెయిల్ మంజూరు కానీ డిపాజిట్ పదివేల కోట్ల రూపాయలు

Posted: 03/26/2014 03:51 PM IST
Conditional bail to subrata roy

సహారా అధిపతి సుబ్రతా రాయ్ కి సుప్రీం కోర్టు మంజూర్ చేసిన బెయిల్ లోని షరతుల్లో ఒకటి పదివేల కోట్ల రూపాయలు డిపాజిట్ చెయ్యటం.  అందులో 5000 కోట్ల రూపాయలు నగదులోను మిగిలిన 5000 కోట్ల రూపయలు బ్యాంక్ గ్యారెంటీ రూపంలో డిపాజిట్ చెయ్యటానికి వెసులుబాటు.  అందుకు గాను సుప్రీం కోర్టు ఫ్రీజ్ చేసిన ఆయన బ్యాంక్ ఖాతాలను తెరవటానికి అనుమతిస్తామని కూడా చెప్పటం జరిగింది.   ఖాతాలను డీఫ్రీజ్ చెయ్యటం కోసం ఖాతాల వివరాలను రేపటి లోగా అందజేయమని చెప్తూ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. 

సుబ్రతా రాయ్ జైల్లో ఉండటం వలన అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చటం కష్టమని ఆయన తరఫు న్యాయవాది అన్నదానికి సుప్రీంకోర్టు తన తీర్పులో ఎంత మాత్రం తగ్గటం జరగదని తేల్చి చెప్పటం జరిగింది. 

నిజానికి సహారా గ్రూప్ మంగళవారం నాడు పెట్టుబడిదారుల సొమ్ము 20000 కోట్ల రూపాయలను సుప్రీం కోర్టుకి జమ కడతామని చెప్పటం జరిగింది. 

షేర్ మార్కెట్ ని నియంత్రించే సెబి కి పడిన బాకీ రూ.20000 కోట్లు చెల్లించకపోవటంతో మార్చి 4 న సుప్రీం కోర్టు జైలుకి పంపించటం జరిగింది. 

ఇటు సుప్రీం కోర్టు నుంచి బెయిల్ మంజూరవగానే సహారా షేర్ మార్కెట్ 10 శాతం పెరిగింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles