Government responsible for muzaffarnagar riots says supreme court

Government responsible for Muzaffarnagar riots says Supreme Court, Supreme Court of India, Chief Justice P Sathasivam, CBI, Special Investigation Team, BJP, BSP leaders

Government responsible for Muzaffarnagar riots says Supreme Court

ముజప్ఫర్ నగర్ హింసాకాండకు బాధ్యత ప్రభుత్వానిదే అన్న సుప్రీం కోర్టు

Posted: 03/26/2014 03:16 PM IST
Government responsible for muzaffarnagar riots says supreme court

ముజప్ఫర్ నగర్ లో జరిగిన హింసాకాండ మీద సిబిఐ విచారణ కానీ లేదా సిట్ ని కాని వెయ్యమని కోరిన పిటిషన్ మీద స్పందిస్తూ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి సదాశివం నేతృత్వంలో జరిగిన ధర్మాసనం ఆ అవసరం లేదని, బాధ్యతంతా అప్పటి రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఇంటెలిజెన్స్ వైఫల్యం వలనే హింసాత్మక ఘటనలను నిలువరించలేకపోయారని తెలియజేసింది. 

ప్రజలకు ప్రాధమిక హక్కులను సంరక్షించటంలో ప్రభుత్వం విఫలమైందని, బాధితుల కుటుంబాలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్తూ దర్యాప్తు చేసే విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఇవ్వటం జరిగింది.  రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నేరస్తులను వదలకుండా కఠినమైన శిక్షలు అమలు జరిగేలా చూడాలని కూడా ధర్మాసనం కోరింది. 

పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఉత్తర్ ప్రదేశ్ లోని ముజప్ఫర్ నగర్ లో జరిగిన హింసాకాండలో 60 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎందరో నిరాశ్రయులయ్యారు.  స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) 248 మంది మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. 

ఈ ఘటన మీద ఫైల్ అయిన పిటిషన్లన్నిటినీ ఏకకాలంలో విచారణకు తీసుకుంటూ, ఈ కేసులో సిబిఐ దర్యాప్తు కానీ సిట్ విచారణ కానీ ఇంక అవసరం లేదని, నిందితులందరినీ వాళ్ళ రాజకీయ పదవులు, సంబంధాలతో నిమిత్తం లేకుండా వెంటనే అరెస్ట్ చెయ్యాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 

ఛార్జ్ షీట్ ప్రకారం నిందితులలో 16 మంది రాజకీయ నాయకులున్నారు.  అందులో బిఎస్ పి కి చెందిన పార్లమెంటు సభ్యుడు కదిర్ రాణా, ఇద్దరు భాజపా శాసన సభ్యులు, ఒక బిఎస్ పి శాసన సభ్యుడు ఉన్నారు.  ఇద్దరు జాట్ లు ఒక ముస్లిం నాయకుడు చేసిన రెచ్చగొట్టే ప్రసంగం వలన హింస చెలరేగింది.

ఈ ఘటనలో అత్యాచారానికి గురైన మహిళలను పోలీస్ రక్షణలోకి తీసుకోవాలని కూడా ఆదేశించింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles