Tdp mahaboobnagar prajagarjana

TDP Mahaboobnagar prajagarjana public meeting, Chandrababu Naidu, Telugu Desam Party, Telangana Rashtra Samiti, KCR

TDP Mahaboobnagar prajagarjana public meeting, Chandrababu Naidu

ఇంటింటికి ఉద్యోగం మేమిస్తాం, కెసిఆర్ ఇంట్లో వాళ్ళకిస్తాడు

Posted: 03/26/2014 07:46 AM IST
Tdp mahaboobnagar prajagarjana

పాలమూరులో ప్రజాగర్జనలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పార్టీ నినాదం మొదటి నుంచీ జై తెలంగాణా జై ఆంధ్రప్రదేశ్ అనే ఉందని, రాష్ట్ర విభజనకు తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని అన్నారు.  అందరికీ న్యాయం జరగాలని కోరుకున్నాం అది తప్పా అని ప్రశ్నించారాయన.  జాతీయ పార్టీగా ఆవిర్భవించబోతున్న మా పార్టీ ఢిల్లీని శాసిస్తుంది.  సుపరిపాలన సాధించగలగటం మాకే సాధ్యమౌతుంది.  బాబ్లీ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా పోరాడింది మేమే.  ప్రణాళికాబద్ధంగా తెలంగాణాను అభివృద్ధి చెయ్యగలుగుతాం అంటూ చంద్రబాబు తన పార్టీ గురించి చెప్తూ, ఈ విధంగా తాము చెయ్యబోయే కార్యక్రమాలను వివరించారు.

మహబూబ్ నగర్ కి చెందిన లంబాడీ తండా నుంచి ఒకరిని ఎమ్మల్సీని చేస్తాం.  రైతులు, డ్వాక్రా ఋణాలను మాఫీ చేస్తాం.  అప్పటి వరకు ఎవరూ డబ్బులు కట్టకండి.  దీపం పథకాన్ని పునరుద్ధరించి ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తాం.  మహిళలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.  తెలంగాణా రాష్ట్రానికి బిసి ని ముఖ్యమంత్రిని చేస్తాం.  ఇంటింటికీ ఉద్యోగం ఇస్తాం. 

అలా తమ పార్టీ విధానాల గురించి, చెయ్యబోయే కార్యక్రమాల గురించి వివరించిన చంద్రబాబు తెరాసను, ఆ పార్టీ  అధ్యక్షుడు కెసిఆర్ ని దుయ్యబట్టారు.  తెరాస కేవలం ఉప ఎన్నికల పార్టీయేనని, ఎప్పుడూ సాధారణ ఎన్నికలలో గెలుపొందలేదని, ప్రజాగర్జనలో తెలంగాణా పర్యటన అయిపోయేసరికి తెరాస ఖాళీ అయిపోతుందని అన్నారు.  అలాగే కెసిఆర్ గురించి మాట్లాడుతూ, ఆయన పనిచేసే రకం కాదని,  కరీం నగర్ లో గెలిచిన తర్వాత అక్కడే ఇల్లు కట్టుకుంటాను, నెలలో 15 రోజులు అక్కడే ఉంటానని చెప్పినాయన ఫాం హౌస్ లోనే తిష్ట వేసారని అన్నారు.  ఎప్పుడూ ఏ నియోజకవర్గం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని కెసిఆర్ ని విమర్శించారు.  తమ పార్టీ విధానం ఇంటింటికీ ఉద్యోగం ఇవ్వటమైతే, .  కెసిఆర్ తమ ఇంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వటానికి చూస్తున్నారని అన్నారు చంద్రబాబు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles