కుటుంబ సామ్రాజ్యాలుగా ఎదుగుతున్న రాజకీయ పార్టీలు తమను తాము సమర్థించుకుందామని ఏం చెప్పినా అది సరి కాదని, పార్టీలలో కుటుంబ వ్యవస్థలు శుభపరిణామం కాదని లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు.
కుటంబ సభ్యులు పార్టీలో ఉంటే తప్పేమిటని నిన్న తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ప్రశ్నించారు. తన కొడుకు, కూతురు, మేనల్లుడు ఉద్యమంలో పాల్గొన్నవారని, రోడ్ల మీదకు వచ్చినవారని, జైల్లో గడిపినవారని, అంతే కాకుండా వాళ్ళు సమర్ధులు కాబట్టి నాయకులుగా వ్యవహరిస్తున్నారని అన్న కెసిఆర్ మాటలకు ఆయన పేరు ఎత్తకోపయినా జెపి వ్యాఖ్యలు జవాబు చెప్పినట్లుగానే ఉన్నాయి.
తన పార్టీ కార్యాలయంలో మాట్లాడిని జెపి రాష్ట్రంలో ఈసారి 70 లక్షల మంది యువతి మొదటిసారిగా ఓటు వెయ్యటానికి అర్హత కలిగివున్నారని చెప్తూ, మొత్తం వోటర్లలో 50 శాతం యువతే ఉన్నారని అన్నారు. అందువలన అందులోనూ సమర్ధవంతులున్నారు కనుక పార్టీ అధినాయకత్వం మొండిగా తమ వైఖరిని సమర్థించుకుంటూ తమ కుటుంబ సభ్యులకే ప్రాధాన్యతనివ్వటం సరికాదని అన్నారు.
యువతను ఉద్దేశిస్తూ, రాజకీయాల్లోకి వచ్చేందుకు అర్హతలున్నవారు అధిక సంఖ్యలోనే ఉన్నారు కాబట్టి మనందరం రాజకీయ నాయకుల పిల్లలతో సమానందా ఎదగాలని, ఆత్మగౌరవంతో బతకాలని అన్నారు.
దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది యువతీయువకులు ఈ ఎన్నికలలో మొదటిసారిగా వోటు వేయబోతున్నారని, అందువలన మార్పనేది యువత నుంచే రావాలని, యువత ముందుకు వచ్చి రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషించాలని జయప్రకాశ్ నారాయణ పిలుపునిచ్చారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more