ప్రపంచ పిచ్చుకల దినం సందర్భంగా చేసుకుంటున్న జ్ఞాపకాలు-
పట్టణాలలో కూడా పిచ్చుకలు మనుషులతో సహజీవనం చేస్తుండేవి ఒకప్పుడు. కిటికీ లోంచి ఇంటిలోపలకి వచ్చి పీచుపీచుమంటూ శబ్దాలు చేస్తూ, అద్దంతో ఆడుకుంటూ వుండేవి. పిచ్చుకలు పెట్టిన గూడుని చూస్తే ఆ చిన్నారి పక్షిజాతికి అంత వాస్తు నిర్మాణం ఎలా తెలిసిందా అని అబ్బురపడకమానరు ఎవరైనా.
గడ్డితో అల్లిన గూడు లోపల పిల్లలకు సమశీతలాన్నిస్తుంది. పిచ్చుక పిల్లలకోసం తల్లి పిచ్చుకలు గూటిలో మెత్తటి వస్తువులను సమకూర్చి పెడతాయి. అవన్నీ మనం వాడుకునే వస్తువులలో మనం పారేసిన వాటిలోంచి అవి ఏరుకున్నవే. చెట్టు కొమ్మలకు తయారు చేసుకుంటాయి పిచ్చుకలు వాటి గూళ్ళు. పిచ్చుకల గూటిలోకి పోవాలంటే దానికి మార్గం కింది నుండి పైకి ఉంటుంది, అది కూడా పిచ్చుకంత చిన్న పక్షికి మాత్రమే ఎగురుతూ ప్రవేశించటానికి వీలుగా ఉంటుంది. అంటే లోపలి పిల్లలకు పూర్తి భద్రత.
మానవ జీవితంలో నిత్యం కళ్ళకు కనిపించే రంగులు దృశ్యాలే కాకుండా, చెవులకు వినిపించే శబ్దాలు, ముక్కుకు తగిలే వాసనలు కూడా మారిపోయాయి. పచ్చటి చెట్లు, పక్షుల కిలకిలరావాలు, గోవులు ఇతర పశువుల శబ్దాలు, మట్టి వాసనలు అంతమైపోయాయి. ఇప్పుడు పట్టణాలలో ఆకాశం కూడా కనిపించదు, దాన్ని చూసే సమయం ఓపికా కూడా లేవు. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి ఉత్పన్నమయ్యే రేడియేషన్, చుట్టూ వాహనాల శబ్ద కాలుష్యం, వాతావరణంలో రసాయనిక కాలుష్యం ఇవీ ప్రస్తుతం నగరవాసుల జీవనశైలి.
పిచ్చుకలు పట్టణాలను విడిచి పోయాయంటే ఇక మిగిలిన పక్షులు కూడా వెళ్ళిపోతాయంటున్నారు శాస్త్రవేత్తలు. కాకులు కూడా పట్టణాలను వదిలి చాలావరకు వెళ్ళి పోయాయి. ఇందుకు కారణాలు విశ్లేషిస్తే, పూర్వకాలంలో జీవన శైలికి ఇప్పటి జీవన విధానానికీ ఉన్న తేడాయే.
1. పిండ్లు, గింజలను శుభ్రపరచి ఆరబోసేవారు. వాటిలోంచి కొంతభాగం పక్షులు సంగ్రహించటానికి వీలుండేది. ఇప్పుడు మనకు వండుకోవటానికి వీలుగా శుభ్రపరచిన పదార్థాలు లభిస్తున్నాయి.
2. పిండి ముగ్గులు వేసేవారు. అపార్ట్ మెంట్లు వచ్చిన తర్వాత అది ఇప్పుడు లేదు.
3. చెట్లు, మొక్కలు, వృక్షజాతి పక్షులకు ఆలవాలంగా ఉండేవి. ఇప్పుడు ఏ కాస్త జాగా దొరికినా అక్కడ ఇల్లు కట్టుకోవటం జరుగుతుంది కాబట్టి అటువంటి అవకాశాలు పక్షులకు దూరమయ్యాయి.
4. ఇళ్ళ కట్టడాలు కూడా పక్షులకు నివాసానికి, లోపలికి రావటానికి వీలుగా ఉండేవి. కానీ పెంకుటిళ్ళు, గడ్డి కప్పుతో ఉండే ఇళ్ళ స్థానంలో సిమెంట్ స్లాబ్స్ వచ్చిన తర్వాత నగరాలు కూడా కాకులు దూరని కారడవిలాతయారయ్యాయి.
ఇలా ఎన్నో కారణాల వలన పక్షులకు ఆదరణ తక్కువవటంతో మనకు వాటితో కలిసి జీవించే అవకాశం తక్కువైపోయింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more