100 years old temple belongings found under house

100 years old temple belongings found under house, idols and temple things found, idols found under residential house, Archeological department

100 years old temple belongings found under house

ఇంటి కింద బయటపడ్డ విగ్రహాలు ఆలయ పూజా సామగ్రి

Posted: 03/22/2014 08:45 AM IST
100 years old temple belongings found under house

కోదాడ సమీపంలో అనంతగిరిలో నివసించే రైతు దామూరి భద్రయ్య బుధవారం నాడు తన ఇంటిని పునర్నిర్మాణం చెయ్యటానికి చేస్తున్న తవ్వకాలలో పురాతనకాలంనాటి విగ్రహాలు, రాగి బిందెలు, శఠగోపం ఇంకా ఇతర పూజా సామాన్లు బయటపడ్డాయి. 

భద్రయ్య తన పొరుగువారితో కలిసి ఈ విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తేగా ఆయన వాటిని తన ఆధీనంలోకి తీసుకున్నారు.  పురావస్తు శాఖ వారిని పిలిపించగా వారు వాటిని పరీక్షించి అవి 100 సంవత్సరాల నాటి వస్తువులని నిర్థారించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు సమక్షంలో పంచనామా జరిగి, వస్తువులను జప్తు చెయ్యటం జరిగింది. 

అయితే అందులో రెండు విగ్రహాలను గ్రామ వాసులు ఆలయంలో పెట్టటానికి అనుమతిని కోరారు.  పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాములు నాయక్ మాట్లాడుతూ ఆ శాఖ అధికారులు వచ్చి పరీక్షించి తవ్వకాలు జరపాలా వద్దా అన్నది నిర్ణయిస్తారని అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles