Raghuveera to finalize candidates

Raghuveera to finalize candidates, APCC President Raghuveera Reddy, Minister K Pardha Saradhi, Shatrucharla Vijaya Ramaraju

Raghuveera to finalize candidates

పగ్గాలందుకుంటూనే పనిమొదలుపెట్టిన రఘువీరా

Posted: 03/17/2014 10:42 AM IST
Raghuveera to finalize candidates

సీమాంధ్ర ప్రాంతానికి పిసిసి అధ్యక్షడుగా నియమితులైన రఘువీరా రెడ్డి ఏ మాత్రం సమయాన్ని వృధాకానివ్వకుండా వలసలు పోగా మిగిలిన కాంగ్రెస్ నాయకులు వలసలు పోకుండా పార్టీని కాపాడుకునే పనిలో పడ్డారు.  అంతకు ముందు, పార్టీని వదిలిన నాయకులు పార్టీలోకి తిరిగి రమ్మని కూడా పిలుపునిచ్చారాయన. 

ఆదివారమంతా ఫోన్లలో బిజీగా ఉన్న రఘువీరా రెడ్డి, మాజీ మంత్రులు మహీధర రెడ్డి, కె పార్థసారధి లతో మాట్లాడి తొందరపాటు నిర్ణయాలతో ఇతర పార్టీలలోకి వెళ్ళవద్దని కోరారు.  మహీధర రెడ్డితో ఉన్న సన్నిహతి సంబంధం వలన రఘువీరా రెడ్డి తన పనలో కృతకృత్యులవవచ్చని ఆయన సన్నిహితుల నుంచి వచ్చిన సమాచారం. 

కానీ తెలుగు దేశం పార్టీలో కలిసిన శత్రుచర్ల విజయరామరాజు, ఆయన మేనల్లుడు తాటిరాజు జనార్దన్ లతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది.  వాళ్ళు తిరిగి కాంగ్రెస్ లోకి రావటానికి నిరాకరించారు. 

అలా సీమాంధ్రలోని ఎమ్మల్యేలు, ఎంపీలు, మాజీ మినిస్టర్లతో మాట్లాడుతూ రఘువీరా రెడ్డి ఎన్నికలలో నిలబడే అభ్యర్థుల జాబితాను తయారు చెయ్యటం ఆయన రెండు రోజుల్లో ముగించాల్సిన పని.  మన్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కరువైన సందర్భంగా అభ్యర్థుల వేటలో పడ్డ కాంగ్రెస్ పార్టీని సీమాంధ్రలో నడిపిస్తున్న రఘువీరా రెడ్డి పార్టీ ఎన్నికల సంఘంతో రెండు రోజుల్లో జాబితా తయారు చేసే విషయంలో చర్చించనున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles