Prajagarjana at visakhapatnam

Prajagarjana at Visakhapatnam, Telugu Desam Party, Chandrababu Naidu, Ganta Srinivasa Rao, Ayyanna Patrudu

Prajagarjana at Visakhapatnam, Telugu Desam Party, Chandrababu Naidu

విశాఖలో ఘనంగా జరిగిన ప్రజాగర్జన

Posted: 03/13/2014 07:30 AM IST
Prajagarjana at visakhapatnam

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నం మున్సిపల్ స్టేడియంలో జరిగిన ప్రజాగర్జన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ర్యాలీతో వేదిక వరకు చేరుకోగా సభికులు హర్షోల్లాసాన్ని ప్రదర్శించారు.  ఒంటెలు, డ్యాన్సులు, డప్పులతో కోలాహలంగా జరిగింది చంద్రబాబు ర్యాలీ.  ఈ సభలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెదేపాలో చేరి, పార్టీ అప్పగించే బాధ్యతలను పూర్తిగా నెరవేరుస్తానని మాటిచ్చారు.

సభలో మాట్లాడుతూ చంద్రబాబు మిగతా అన్ని పార్టీల మీద విమర్శాస్త్రాలను వదిలారు.  అన్నిటినీ కలపి కూడా రావణాసురిడి పార్టీ అని అభివర్ణించారు.  కాంగ్రెస్ రావణుడి పది తలకాయల్లో  తెరాస, వైకాపా, జై సమైక్యాంధ్ర కూడా ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు.  అవన్నీ కలిపే కాంగ్రెస్ రావణ పార్టీ కాబట్టి దాన్ని కూకటివేళ్ళతో పెకిలించి, భూస్థాపితం చెయ్యవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. 

కిరణ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయన పెట్టిన పార్టీ పేరు కిరికిరి పార్టీ అని ఉంటే సరిపోయేదని అన్నారు.  అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రానికి ఏమీ చెయ్యలేని సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి సాధించేదేముందని చంద్రబాబు ప్రశ్నించారు. 

సోనియా రాహుల్ గాంధీల గురించి మాట్లాడుతూ, రాష్ట్ర విభజనను చేసిన వాళ్లు ఏనాడైనా మాట్లాడారా. లేదు.  కానీ వాళ్ళ తొత్తులైన దిగ్విజయ్ సింగ్, జైంరామ్ రమేష్ ఇప్పుడు రాజధాని గురించి వివాదం తీసుకొద్దామని చూస్తున్నారు కానీ తెదేపా అధికారంలోకి వస్తుంది, రాజధానిని నిర్ణయిస్తుందని చంద్రబాబు ఆవేశంగా చెప్పుకొచ్చారు. 

వైయస్ ఆర్ కాంగ్రెస్ విషయంలో అది ఒక సైకో పార్టీ అని చంద్రబాబు అన్నారు.  ఎన్నికలలో గెలిచి ఢిల్లీలో కూర్చుని కేసులను మాఫీ చేయించుకోవటమే ఉద్దేశ్యంగా ఎన్నికలలోకి వస్తోంది కానీ ప్రజల సంక్షేమం కోసం కాదని అన్నారు.  తెలుగు దేశం పార్టీ మీద నమ్మకం ఏర్పడబట్టే ఎంతో మంది నాయకులు ఇందులో చేరుతున్నారని, అయితే పార్టీలో పనిచేసిన కార్యకర్తలు, నాయకుల విషయంలో అన్యాయం జరగదని హామీ ఇస్తూ, ఈ సారి ఎప్పుడూ లేని విధంగా ప్రజలే ఐవిఆర్ఎస్ ద్వారా తెలుగు దేశం పార్టీ అభ్యర్థులను ఎన్నుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేసామన్నారు చంద్రబాబు. 

అయినా తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు, గంటకో పార్టీ మార్చవద్దని అనటంతో గంటాతోపాటు తెదేపా లో చేరిన ఇతర సభ్యులు మనస్తాపం చెందారు.  ఇప్పుడు పార్టీలో చేరినవాళ్ళు ఐదు సంవత్సరాలు కష్టపడి పార్టీలో పనిచెయ్యవలసిందిగా ఆయన వాళ్ళకి విజ్ఞప్తి చేసారు.  తెలుగు దేశం పార్టీ కార్యకర్తలే పార్టీకి మొదటి నుంచీ అండగా ఉన్నారని, తాను జీవితాంతం కార్యకర్తగానే ఉండి పనిచేస్తానని అయ్యన్న పాత్రుడు అన్నారు. 

సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటే కొందరు ఎగతాళి చేస్తున్నారు కానీ మా తొమ్మిదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని అబివృద్ధి పరచలేదా, ప్రపంచపటంలో చేర్చలేదా అని అడిగారు.  హైద్రాబాద్ లాంటి నగరాలను సీమాంధ్రలో నాలుగైదు నగరాలను అభివృద్ధి చేస్తానని చంద్రబాబు సభాముఖంగా హామీ ఇచ్చారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles