Apstrc strike called off

APSTRC strike called off, APSRTC interim relief, APSRTC Employees Union, Telangana Mazdoor Union, Transport Minister Botsa Satyanarayana, Interim relief of APSRTC employees for February, IR to APSRTC employees for March 2014

APSTRC strike called off, APSRTC interim relief, APSRTC Employees Union, Telangana Mazdoor Union

ఈరోజు నుంచి చేస్తామన్నఆర్టీసీ సమ్మె విరమణ

Posted: 03/12/2014 09:10 AM IST
Apstrc strike called off

ఈరోజు నుంచి సమ్మె బాట పట్టనున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ జరిగింది. 

జనవరి నెలలో రవాణా శాఖా మంత్రి బొత్సా సత్యనారాయణ 27 శాతం మధ్యంతర భృతిని ఫిబ్రవరి నెలలో కలిపి ఇస్తామని వాగ్దానం చేసినా ఫిబ్రవరి నెల జీతంతో పాటు ఇవ్వనందుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘం, తెలంగాణా మజ్దూర్ సంఘం తిరిగి సమ్మె చెయ్యటానికి సిద్ధపడ్డాయి.  మంగళవారం సాయంత్రం ఆర్టీసీ మేనేజ్ మెంట్ తో జరిగిన సంప్రదింపుల వైఫల్యం తర్వాత తిరిగి రెండు ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వటానికి సిద్ధపడ్డాయి. 

అయితే, మరోసారి జరిగిన చర్చల అనంతరం, ఆర్టీసీ యాజమాన్యం మార్చి నెల మధ్యంతర భృతిని ఏప్రిల్ నెల జీతంతో పాటు ఇవ్వటానికి, ఫిబ్రవరి నెలకు చెందిన సొమ్మును ఏప్రిల్ 15 వరకు ఇవ్వటానికి అంగీకరించటంతో సమ్మె చెయ్యటానికి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవటం జరిగింది. 

మధ్యంతర భృతి ఇవ్వటానికి ఆర్టీసీ యాజమాన్యం మీద సంవత్సరానికి రూ.385 కోట్ల భారం పడుతోంది. 

పై ఫొటోలో బస్సుని ఆపటానికి కాదు మొరాయించిన బస్సుని ఆవిధంగా తోసి స్టార్ట్ చేస్తున్న కండక్టర్, ప్రయాణీకులు!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles