Rahul calls modi another hitler

Rahul calls Modi another Hitler, Rahul Gandhi AICC, Narendra Modi BJP, Modi compared with Hitler, Mahatma Gandhi, Srikrishna Kulkarni, Gandhi grand grand son

Rahul calls Modi another Hitler, Rahul Gandhi AICC, Narendra Modi BJP, Modi compared with Hitler, Mahatma Gandhi

మోదీ మరో హిట్లరని చెప్పకనే చెప్పిన రాహుల్

Posted: 03/12/2014 08:43 AM IST
Rahul calls modi another hitler

భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోదీ పేరు ఎత్తకుండానే మోదీని హిట్లర్ తో పోల్చటమే కాకుండా, హిట్లర్ తర్వాత మళ్ళీ మోదీయే అన్నట్లుగా చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, అప్రకటిత ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ.

దేశానికి వాచ్ మన్ అవసరం లేదు అని గుజరాత్ లో బహిరంగ సభలో చేసిన ప్రసంగంలో మోదీ మాటలను తిప్పికొట్టిన రాహుల్ గాందీ, ఒకప్పుడు నియంత హిట్లర్ కూడా ఎవరికీ ఏమీ తెలియదని, తనకే అన్నీ తెలుసని అనుకునేవాడని, నాయకుడనేవాడు ఎప్పుడూ తన గురించే చెప్పుకుంటూ ఎడాపెడా వాగ్దానాలు చెయ్యటం సబబు కాదని అన్నారు. 

నాయకుడనేవాడు చెయ్యవలసింది ప్రసంగాలివ్వటం కాదు ప్రజలు చెప్పేది వినటం.  ప్రజలలోకి వెళ్ళాలి, వాళ్ళు చెప్పేది వినాలి అన్న రాహుల్ గాంధీ, నాయకుడనేవాడు మహాత్మా గాంధీ లాగా నిగర్విగా ఉండాలని అన్నారు. 

రాజకీయాలలో ఎదుటివారి ప్రాభవాన్ని తగ్గించటం కూడా విజయానికి దారితీస్తుందన్న పాఠాలు నేర్చుకున్న రాహుల్ గాంధీ తన ప్రసంగ వైఖరిని కాలానుగుణంగా చక్కదిద్దుకుని కాంగ్రెస్ పార్టీకి ఏకైక ప్రచార సారధిగా దేశమంతా పర్యటిస్తున్నారు.  నరేంద్ర మోదీ పట్టుగొమ్మైన గుజరాత్ లో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం జాతీయ స్థాయిలో వార్తలలోకి ప్రముఖంగా ఎక్కుతుందని ఆయనకు తెలుసు. అందుకే, అవినీతి గురించి మాట్లాడుతున్న మోదీ తన మంత్రులలో అవినీతికోరులనే పెట్టుకున్నారంటూ వ్యాఖ్యానించారు.

నరేంద్ర మోదీ ప్రసంగాల వలన దేశం యావత్తూ ఆయన వైపుగా మొగ్గు చూపించటం వలన అసలు ప్రసంగాలు కాదు కావలసింది, ప్రజల యోగక్షేమాలను తెలుసుకోవటం ముఖ్యమంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. 

మొత్తం మీద రాహుల్ గాంధీ ప్రసంగాలు సమకాలీన రాజకీయ వైఖరికి అనుగుణంగా మారుతున్నాయంటే ఆయన ఉపన్యాసాలను తయారుచేసేవాళ్ళని పొగడాలి.  అయితే, దాన్ని కాలానుగుణంగా మార్చుకోలేని రాహుల్ వాటిని యధాతధంగా చెప్పుకొస్తున్నారని తెలుస్తోంది.  ఎందుకంటే,  మహాత్మా గాంధీ పేరును మాటిమాటికీ తీసుకొస్తున్నారు కానీ రాహుల్ గాంధీ తన నెహ్రూ కుటుంబంలోని వాళ్ళ గురించి చెప్పటం లేదని మహాత్మా గాంధీ మునిమనుమడు కులకర్ణి విమర్శించినట్లుగా, గాంధీకి దేశంలో ఉన్న ప్రతిష్ట తన పేరులో ఉన్న గాంధీ మూలంగా కొంతైనా సంక్రమిస్తుందనే భావనలో మహాత్మా గాంధీ పేరుని ఏదో విధంగా ఉచ్ఛరించటం చేస్తున్నారు. 

ఆ మధ్య మహాత్మా గాంధీని చంపింది కూడా ఆర్ఎస్ఎస్ అని అన్నారాయన.  కానీ కులకర్ణి మాటలతో దాన్ని సరిచేసుకోలేకపోయారంటే అందుకు తగిన సమయం లేదన్న మాట. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles