Tough competition in seemandhra elections

tough competition in Seemandhra elections, Telugu Desam Party, YSRCP, BJP, Congress party, Kiran Kumar political party, Pawan Kalyan political party

tough competition in Seemandhra elections

సీమాంధ్రలో గట్టి పోటీ, మథనంలో పార్టీలు

Posted: 03/07/2014 11:59 AM IST
Tough competition in seemandhra elections

రాష్ట్ర విభజన బిల్లును అడ్డదిడ్డంగా ఆమోదింపజేసుకున్నారనే భావనతో భాజపా, కాంగ్రెస్ పార్టీలకు సీమాంధ్రలో పరపతి పోయింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఊపందుకుంటుందనుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తెదేపాలోకి వలసపోతున్న తరుణంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు నిర్వహించటం మొదలుపెట్టింది.   భారతీయ జనతా పార్టీ సీమాంధ్రకు న్యాయం చేసింది తామేనంటూ ప్రచారాలకు పూనుకుంది.  కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దగా భయపడేది లేకపోయినా ప్రస్తుతం ఆవిర్బవించనున్న మరో రెండు పార్టీలతో కలిపి ఆరు పార్టీలు సీమాంధ్ర ఎన్నికల బరిలో నువ్వా నేనా అంటూ పోటీ చెయ్యనున్నాయి. 

మాజీ ముఖ్యమంత్ర కిరణ్ కుమార్ రెడ్డి, బహు సంఖ్యలో అభిమానులున్న సినీ నటుడు, మెగా స్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ తమ తమ సొంత పార్టీలు పెట్టబోతున్న సందర్భంగా సీమాంధ్రలో ఆరు పార్టీలు గట్టి పోటీనివ్వబోతున్నాయి.  కమ్యూనిస్ట్ పార్టీలు, లోక్ సత్తాలు కూడా పోటీ చెయ్యవచ్చు కానీ పై ఆరు దిగ్గజాల పోరాటంలో ఇవి కాస్త వెనకే ఉంటాయి. 

పవన్ కళ్యాణ్ ఆదివారం 9 వ తేదీన, కిరణ్ కుమార్ 12 న రాజమండ్రిలో తమ పార్టీ వివరాలను తెలియజేస్తామంటున్నారు.  దీనితో చీలిపోయే వోట్లుంటాయని, అప్పుడు అంచనా వెయ్యటం కష్టమౌతుందని తెలుగుదేశం పార్టీ వైకాపాలు ఆందోళన చెందుతున్నాయి. 

జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కూడా ఇదే సమస్యను ఎదుర్కుంటోంది.  కొత్త కొత్త పార్టీలు కొత్త కొత్త పొత్తులతో కూటమిలు తయారవుతుండటం అంచనాలను తలకిందులు చేసే ప్రమాదం ఉంది కాబట్టి భాజపా అటువంటివాటి మీద మండి పడుతోంది.  థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ కి వోటేస్తే కాంగ్రెస్ కి వేసినట్లే సుమా అని హెచ్చరిస్తోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles