3d finger print phantom

3D Finger Print Phantom, Anil Jain group of scientists, Michigan State University, Finger print matching with 3d imaging, 3 D finger print more accurate

3D Finger Print Phantom, Anil Jain group of scientists

3డి లో వేలిముద్రలు- ఇండో అమెరికన్ కృషి ఫలితం

Posted: 03/06/2014 03:02 PM IST
3d finger print phantom

ఐఐటి కాన్పూర్ నుంచి పట్టభద్రుడైన అనిల్ జైన్ అమెరికాలో మిచిగన్ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించి వేలిముద్రలను మ్యాచ్ చెయ్యటంలో మరింత ఉపయోగపడే విధంగా 3 డి లో వేలిముద్రలను భద్రపరచే ప్రయత్నంలో సఫలులయ్యారు. 

మానవ వేలిముద్రలలో ఇది మొట్టమొదటి త్రీ డైమన్షనల్ మోడల్.  దీని వివరాలను తన అధికారిక వెబ్ సైట్ లో పోస్ట్ చేసిన మిచిగన్ విశ్వవిద్యాలయం ఇది వేలి ముద్రలను సరిపోల్చటంలో వేగంగా పనిచెయ్యటమే కాకుండా భద్రతా ప్రమాణాలను కూడా కలిగివుందని చెప్తోంది. 

ఇంతవరకు 2డి లో వేలిముద్రలను సరిపోల్చటానికి ఉపయోగించేవారు.   ఈ విధానంలో అనిల్ జైన్ బృందం ఫింగర్ ప్రింట్ ఫాంటమ్ గా అభివర్ణించే వేలి మీది రేఖలు ఎత్తు పల్లాలను 3డి లో చూపిస్తుంది.  అంటే ఎదురుగా ఆ వేలు ఉన్నట్టుగానే ఉంటుంది.  వైద్య శాస్త్రంలో 3డ్ ఫాంటమ్ లు ఉపయోగించటం సాధారణమే.  ఉదాహరణకు గుండె కానీ కిడ్నీ కాని స్కానింగ్ లో 3 డి ఫార్మట్ లో కనిపించేట్టుగా వాటి డైమన్షన్లను తీసుకుని ఇమేజింగ్ చెయ్యటం జరుగుతుంది.  అలాగే వేలి ముద్రల విషయంలో కూడా 3డి లో వాటి డైమన్షన్లను పరిగణనలోకి తీసుకుని మ్యాచ్ చెయ్యటానికి ఉపయోగించవచ్చని అనిల్ జైన్ వివరించారు. 

కాన్పూర్ లో ఐఐటి లో బిటెక్ చేసిన అనిల్ జైన్ ఎమ్ ఎస్ పిహెచ్ డి లను ఓహియే స్టేట్ యూనివర్శిటీ నుంచి చేసారు.  బయోమెట్రిక్ లో గుర్తించే విధానంలో మరెన్నో విధాలుగా కృషి చేసిన అనిల్ జైన్ ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను అందుకున్నారు. 

అయితే సైన్స్ లో ఎంత సాధించినా ఇంకా సాధించేది మిగిలే ఉంటుంది.  అందుకే సైన్స్ పరిశోధన నిరంతరం సాగే ప్రక్రియ.  దానికి అంతుండదు.  3 డి లో వేలి ముద్రలు వచ్చిన తర్వాత ఇంకా కచ్చితంగా సరిపోల్చాలంటే మరో విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవలసి వుంటుంది.  అది వేలి టెక్స్చర్ లేక వేలి స్పర్శానుభవం.  అది కూడా పొందుపరచగలిగితే ఇక అనుమానం లేకుండా వేలిముద్రలను మ్యాచ్ చెయ్యవచ్చు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles